ఘోరం: అరకు బస్సు ప్రమాదానికి కారణం ఇదేనా...

By telugu teamFirst Published Feb 12, 2021, 11:48 PM IST
Highlights

విశాఖపట్నం జిల్లా అరుకులో జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి డ్రైవర్ కు దారి విషయంలో సరైన అవగాహన లేకపోవడమే కారణమని భావిస్తున్నారు. పైగా, చీకటి పడడంతో దారిని గుర్తించడం కూడా కష్టమైందని అంటున్నారు.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా అరకు ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదానికి డ్రైవర్ కు సరైన అవగాహన లేకపోవడమే కారణమని భావిస్తున్నారు. ఘాట్ రోడ్డుపై డ్రైవర్ అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదం సంభవించి ఉంటుందని అనుకుంటున్నారు. చీకటి పడడంలో దారిని అంచనా వేయడంలో డ్రైవర్ విఫలమైన ఉండవచ్చునని కూడా అంటున్నారు. మరో వాదన కూడా వినిపిస్తోంది. బస్సు బ్రేకులు ఫెయిలైనట్లు చెబుతున్నారు. ఓ వృక్షం పలువురి ప్రాణాలను కాపాడింది. బస్సు వృక్షానికి తట్టుకుని నిలిచిపోయింది. 

ఉదయం ఐదున్నర గంటలకు బస్సు హైదారబాదు నుంచి బయలుదేరింది. ప్రయాణికులంతా ఈ నెల 14వ తేదీన హైదరాబాదు రావాల్సి ఉండింది. 

మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు చెబుతున్నారు. బాధితులు అరకును సందర్శించిన బొర్రా గుహలు చూసి తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం వస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల సమయంలో తిరుగు ప్రయాణం అవుతున్నట్లు బంధువులకు సమాచారమిచ్చారు. 

ఆ తర్వాత వారి మొబైల్స్ స్విచాఫ్ అయినట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి తెలుసుకున్న హైాదరాబాదులోని వారి బంధువులు తీవ్రం విషాదంలో మునిగిపోయారు. అందుబాటులో ఉండాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్ ను ఆదేశించారు. 

విశాఖపట్నం జిల్లా బస్సు ప్రమాదంపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదంలో కొంత మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 

Also Read: అరకు: లోయలోకి దూసుకెళ్లిన టూరిస్ట్ బస్సు.. నలుగురు దుర్మరణం, ఇంకా పెరిగే అవకాశం

ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. విశాఖ ఆరకు లోయలో జరిగిన విషయం తెలిసిసి ఎంతో బాధపడ్డానని ఆయన అన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్లు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ వేదికగా స్పందించారు.

విశాఖపట్నం అరకు బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటీ రామారావు కూడా ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ప్రమాద వివరాల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. వివరాలకు 08912590102, 08912590100 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.

click me!