విశాఖలో మరో కిడ్నాప్ కలకలం: రియల్టర్ శ్రీనివాస్ దంపతుల కిడ్నాప్

Published : Jun 29, 2023, 11:16 AM ISTUpdated : Jun 29, 2023, 12:17 PM IST
విశాఖలో మరో కిడ్నాప్ కలకలం: రియల్టర్ శ్రీనివాస్ దంపతుల కిడ్నాప్

సారాంశం

విశాఖపట్టణంలో గురువారంనాడు  రియల్టర్ శ్రీనివాస్ దంపతులు  కిడ్నాప్‌నకు గురయ్యారు

విశాఖపట్టణం: విశాఖపట్టణంలో  గురువారంనాడు  రియల్ ఏస్టేట్ ఏజంట్ శ్రీనివాస్,  ఆయన భార్య లక్ష్మిని  కిడ్నాప్  చేశారు దుండగలు,  కిడ్నాప్ చేసిన దుండగులను  పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు.  

ఈ నెల  15వ తేదీన  విశాఖ ఎంపీ  ఎంవీ సత్యనారాయణ  భార్య, కొడుకు  ఎంపీకి చెందిన  ఆడిటర్  జీవీని కిడ్నాప్  చేశారు దుండగులు.  ఈ కిడ్నాప్  వ్యవహరాన్ని  పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు.  కిడ్నాప్ చేసిన దుండగులను పోలీసులు అరెస్ట్  చేశారు.  విశాఖ ఎంపీ  కుటుంబ సభ్యుల కిడ్నాప్ లో  రౌడీషీటర్  హేమంత్  కీలకపాత్ర పోషించారని  పోలీసులు  ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఈ ఘటన  మరువక ముందే  మరో రియల్టర్  కిడ్నాప్  ఘటన  చోటు  చేసుకుంది.  విజయవాడ  నుండి విశాఖపట్టణానికి వచ్చిన  రియల్ ఏస్టేట్  ఏజంట్ శ్రీనివాస్ దంపతులు కిడ్నాప్‌నకు గురయ్యారు.రియల్ ఏస్టేట్ సంస్థలో  శ్రీనివాస్  ఏజంట్ గా  పనిచేస్తున్నాడు.  శ్రీనివాస్ పై  గతంలో విజయవాడలో  కేసు నమోదైంది.   రియల్ ఏస్టేట్ సంస్థలో  అవకతవకలకు పాల్పడ్డారని శ్రీనివాస్ పై  ఆరోపణలున్నాయి. అవకతవకలకు  పాల్పడిన  స్వాహా చేసిన డబ్బుల్లో  తమకు  కొంత వాటా ఇవ్వాలని  దుండగులు కిడ్నాప్  చేశారని  పోలీసులు అనుమానిస్తున్నారు.  కిడ్నాప్ నకు పాల్పడిన  నలుగురు నిందితులను  విశాఖపట్టణం  పోలీసులు  అరెస్ట్  చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Minister Gottipati Ravi Kumar: వైసీపీ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్ | Asianet News Telugu
Gottipati Ravi Kumar: హత్యా రాజకీయాలు చేస్తే వదిలేది లేదు: మంత్రి గొట్టిపాటి| Asianet News Telugu