పోలింగ్ కి సర్వం సిద్దం

Published : Aug 22, 2017, 12:11 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
పోలింగ్ కి సర్వం సిద్దం

సారాంశం

నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. చివరి ఘ‌టానికి మ‌రో అడుగు దూరంలో ఉంది. నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలో 2,18,858 మంది ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నిక కోసం మొత్తం 255 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. చివరి ఘ‌టానికి మ‌రో అడుగు దూరంలో ఉంది. హోరా హోరిగా జ‌రిగిన పార్టిల ప్ర‌చారం నిన్న‌టి సాయంత్రం 6 గంట‌లకు  ముగిసింది. రేపు జరిగే పోలింగ్‌ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలో 2,18,858 మంది ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికల్లో 72.09శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ఉద‌యం 7గంట‌ల నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు క్యూలో నిల‌బ‌డిన వారికి ఓటు హాక్కును వినియోగించుకోవ‌చ్చు.


ఎన్నిక‌ల క‌మీష‌న్ నంద్యాల ఉప ఎన్నిక కోసం మొత్తం 255 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల్లో  74 సమస్యాత్మక, 141 అత్యంత సమస్యాత్మక పోలింగ్ బూత్ లుగా గుర్తించింది. స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. అక్క‌డ‌ కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. పోలింగ్ బూత్‌ల్లోనూ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలించేలా సిబ్బందిని అప్రమత్తం చేశారు. 2,500 మంది పోలీసుల‌ను మోహ‌రించారు. ఓటర్‌ స్లిప్‌లను ఇప్ప‌టికే అందజేశారు. 


ఇప్ప‌టికే కర్నూలు జిల్లా కలెక్టర్ పోలింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈవీఎంలను స్వయంగా పరిశీలించారు. 
నంద్యాల ఉపఎన్నికల బరిలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం అబ్దుల్ ఖాదర్ తోపాటు మ‌రి కొంద‌రు పోటి చేస్తున్నారు.

మరిన్ని తాజా విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్