రూ 40 వేల కోట్లేమయ్యాయ్ ? కేంద్రం చాలా సీరియస్

First Published Apr 11, 2018, 9:58 AM IST
Highlights
నోట్ల రద్దు తర్వాత ఇప్పటి వరకూ దేశం మొత్తం మీద మరే రాష్ట్రానికి పంపనంతగా ఆర్బిఐ ఏపికి భారీ ఎత్తున డబ్బు పంపింది.

నోట్ల రద్దు దగ్గర నుండి మొన్నటి మార్చి వరకూ ఏపికి వచ్చిన రూ. 40 వేల కోట్లు ఏమయ్యాయనే విషయమై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది.

నోట్ల రద్దు తర్వాత ఇప్పటి వరకూ దేశం మొత్తం మీద మరే రాష్ట్రానికి పంపనంతగా ఆర్బిఐ ఏపికి భారీ ఎత్తున డబ్బు పంపింది. అయినా బ్యాంకుల్లో కానీ ఏటిఎంల్లో గానీ జనాలకు అవసరమైన డబ్బు అందటం లేదు.

దాంతో జనాలంతా బ్యాంకులను, ఆర్బిఐని దుమ్మెత్తిపోస్తున్నారు. క్షేత్రస్ధాయిలో అసలేం జరుగుతోందో ఎవరికీ అర్ధం కాలేదు.

దానికితోడు ఇదే విషయమై బిజెపి నేతలు కూడా కేంద్ర ఆర్దికమంత్రి అరుణ్ జైట్లీకి ఫిర్యాదు చేశారు. అదే సందర్భంలో రాష్ట్రావసరాలకు రూ. 13 వేల కోట్లు పంపాల్సిందిగా ప్రభుత్వం కూడా ఆర్బిఐపై ఒకటే ఒత్తిడి పెడుతోంది.

దాంతో ఆర్బిఐ ఉన్నతాధికారులు రాష్ట్రంలోని అధికారులపై మండిపోతున్నారు. రాష్ట్రంలోని బ్యాంకుల్లో సుమారు రూ. 2269 కోట్లు మాత్రమే ఉందని సమాచారం.

ఆ మొత్తాన్ని బ్యాంకులకొచ్చే ఖాతాదారులకు ఇవ్వాలా? లేకపోతే ఏటిఎంల్లో పెట్టాలా అన్నది బ్యాంకు ఉన్నతాధికారులకు అర్ధం కావటం లేదు.

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలపై ఆర్బిఐని క్షణ్ణంగా దర్యాప్తు చేయాలంటూ కేంద్ర ఆర్ధికశాఖ ఆదేశించిందట. అంటే రేపో మాపో ఆర్బిఐ ఉన్నతాధికారులు రాష్ట్రానికి వచ్చి దర్యాప్తు మొదలుపెట్టనున్నారు.

బ్యాంకుల్లో డబ్బు లేదా ఏటిఎంల్లో ఉంచిన డబ్బు అధికారపార్టీ నేతల వద్దకో లేకపోతే వారికి సంబంధించిన వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిందని వైసిపి ఆరోపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఒకసారి ఆర్బిఐ విచారణ మొదలుపెడితే ఏ బ్యాంకుల నుండి ఎవరెవరు ఎంతెంత డబ్బు డ్రా చేసింది ఇట్టే తెలిసిపోతుంది లేండి..

 

 

click me!