లంక పొలాల్లో పార్టీ చేసుకున్నారు: రావు కమిటీపై రాయపూడి వైసీపీ కార్యకర్తల వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Dec 22, 2019, 08:06 PM IST
లంక పొలాల్లో పార్టీ చేసుకున్నారు: రావు కమిటీపై రాయపూడి వైసీపీ కార్యకర్తల వ్యాఖ్యలు

సారాంశం

రాజధాని ప్రకటన నేపథ్యంలో జీఎన్ రావు కమిటీ సభ్యులపై వైసీపీకి చెందిన ముస్లిం మైనారిటీ సోదరులు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

రాజధాని ప్రకటన నేపథ్యంలో జీఎన్ రావు కమిటీ సభ్యులపై వైసీపీకి చెందిన ముస్లిం మైనారిటీ సోదరులు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రాంతంలో జీఎన్ రావు కమిటి తిరిగిన మాట వాస్తవమేనని.. అయితే వాళ్ళు తిరిగింది రైతుల దగ్గరికి కాదు లంకల్లోనని తెలిపారు.

రాయపూడి లంక పొలాల్లో పార్టీ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారని వారికి అవసరమైన నాయకులని కలిశారని వారు ఆరోపించారు. 200 మందికి బిర్యానిలు వండుకున్నారని వెల్లడించారు.

Also Read:రాజస్థాన్‌ ఎడారిలోకి వెళ్తున్నట్లుంది: అమరావతిపై తమ్మినేని కీలక వ్యాఖ్యలు

2000 మంది కాదు కదా ఏ ఒక్క రైతుని కలవలేదని తెలిపారు. ఆరు నెలల నుండి కమిటీ అధ్యయనం చెయ్యలేదని ఇంట్లో పడుకున్నారని మైనారిటీ సోదరులు ఆరోపించారు. అది జీ ఎన్ రావు కమిటీ కాదని.. జగన్ రావ్ కమిటీ అని సెటైర్లు వేశారు.

జియన్ రావు కమిటీ నివేదిక ఇవ్వకుండా.. సెంబ్లీ లో జగన్ మూడు రాజధానులు ఎలా ప్రకటించారో చెప్పాలి సోదరులు డిమాండ్ చేశారు. నాలుగురోజుల ముందు జగన్ చెప్పిన స్టోరీ జియన్ రావు కమిటీ సీల్డ్ కవర్లో పెట్టి జగన్‌కే ఇచ్చిందని వారు మండిపడ్డారు.

Also Read:మెగా వార్: అన్న కంటే తమ్ముడే ఎక్కువ...తేల్చేసిన నాగబాబు

జగన్ న్ని నమ్ముకొని వైసీపీ పార్టీ కోసం పనిచేసామని.. ఎన్నికల సమయంలో వైసీపీ కి మద్దతు ఇచ్చామని మైనారిటీ సోదరులు గుర్తుచేశారు. రాయపూడి గ్రామంలో 200 ఓట్ల మెజార్టీ రావడానికి తోడ్పడ్డామని, కానీ సీఎం ఇలా మోసం చేస్తాడని అనుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి మాకు జ్ఞానోదయం అయ్యిందని, రాజధాని కోసం రైతులకు అండగా ఉంటామని మైనారిటీ సోదరులు స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!