ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. రాజధానికి వెళ్తుంటే ఎడారిలోకి వెళ్తున్నట్లుందని.. అమరావతికి వెళ్లాలంటే రాజస్థాన్ ఎడారిలోకి వెళ్తున్నట్లుందని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. రాజధానికి వెళ్తుంటే ఎడారిలోకి వెళ్తున్నట్లుందని.. అమరావతికి వెళ్లాలంటే రాజస్థాన్ ఎడారిలోకి వెళ్తున్నట్లుందని వ్యాఖ్యానించారు.
రాజధాని నాది అని ప్రజలు భావించాలి.. కానీ అమరావతిలో ఆ ఫీలింగ్ కనిపించడం లేదని తమ్మినేని అన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని.. విమర్శలు చేస్తున్నవారు వాస్తవాలు తెలుసుకోవాలని సీతారాం సూచించారు.
Also Read:రాజధాని విషయంలో నాగబాబు కీలక వ్యాఖ్యలు...సహకారం అంటూనే జగన్ కి చురకలు
ఇన్‌సైడ్ ట్రేడింగ్ ఆరోపణలపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని స్పీకర్ ప్రభుత్వానికి సూచించారు. ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి మూడు రాజధానుల ప్రతిపాదన తోడ్పడుతుందని తమ్మినేని అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో లో మూడు రాజధానులపై జగన్ చేసిన ప్రకటనను కొందరు స్వాగతిస్తుంటే ఇంకొందరేమో తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ మూడు రాజధానుల ప్రకటనపై సినీనటుడు, జనసేన నాయకుడు, పవన్ కళ్యాణ్ సోదరుడు అయిన నాగబాబు స్పందించారు.
ఇటీవల నాదెండ్ల మనోహర్ తో కలిసి అమరావతి పరిసర ప్రాంత పర్యటనకు నాగబాబు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఇదే విషయాన్నీ గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఇటీవలే జనసేన నాయకులతో కలిసి తాను కూడా పర్యటించానన్నారు. రాజధాని ప్రాంతాల్లో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
Also Read:year roundup 2019: జగన్‌కు జై కొట్టిన ఏపీ, ఎదురీదుతున్న బాబు
అమరావతి నుంచే పరిపాలన కొనసాగించాలని అక్కడున్న రైతులంతా, ప్రజలంతా రోడ్లపైకొచ్చి నిరసనలకు దిగుతున్న విషయం తెలిసిందే. దీంతో వారి ఆందోళనల్ని అర్థం చేసుకోవాలని జగన్ ప్రభుత్వానికి నాగబాబు విజ్ఞప్తి చేశారు.