రేవంత్, ఆది చంద్రబాబును బాగా ఇరికించేశారుగా ?

First Published Feb 23, 2018, 7:43 AM IST
Highlights
  •  ‘ఓటుకునోటు’ కేసు నుండి బయటపడలేక చంద్రబాబు ఇప్పటికీ నానా అవస్తులు పడుతున్నారు.

చంద్రబాబునాయుడుకు బ్యాడ్ టైం మొదలైందా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అప్పుడెప్పుడో ఓటుకునోటు కేసులో రేవంత్ రెడ్డి ఇరికిస్తే తాజాగా మంత్రే స్వయంగా చంద్రబాబును వీడియో సాక్ష్యంగా ఇరికించేశారు. దాంతో చంద్రబాబుకు బ్యాడ్ టైం స్టార్టయిందని టిడిపి నేతలే కాకుండా జనాలు కూడా అనుకుంటున్నారు.
ఓటుకునోటు కేసు గుర్తుంది కదా? అప్పుడెప్పుడో తెలంగాణాలో ఎంఎల్సీ ఎన్నికల్లో రాని ఓటును కొనబోయి ఇరుక్కుపోయారు.

చంద్రబాబు తరపున తెలంగాణా ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి డబ్బుల మూటతో నామినేటెడ్ ఎంల్ఏ ఇంటికి వెళ్ళి వీడియో, ఆడియో సాక్ష్యాలతో సహా ఏసిబికి దొరికేశారు. దాంతో తెలంగాణా-ఏపి ప్రభుత్వాల మధ్య జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే.

 


‘ఓటుకునోటు’ కేసు నుండి బయటపడలేక చంద్రబాబు ఇప్పటికీ నానా అవస్తులు పడుతున్నారు. ఆ కేసులో నుండి బయటపడలేక పదేళ్ళ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను వదులుకున్నారు. రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేయాలని ఇటు తెలంగాణా అటు కేంద్రప్రభుత్వాలను డిమాండ్ చేయలేకపోతున్నారు. ఫలితంగా రాష్ట్రం ఎంత దెబ్బ తింటున్నదో అందరూ చూస్తున్నదే.


ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్రమోడిని నిలదీయలేక రాష్ట్రప్రయోజనాలు, ప్రత్యేకహోదా సాధించలేక జనాల ముందు గబ్బు పట్టిపోతున్నారు. ఫలితంగా రాష్ట్ర రాజకీయాలు రోజుకోరకంగా మారిపోతోంది. దాంతో చంద్రబాబుకు ప్రతీరోజూ టెన్షనే. విభజన సమస్యలు, కేంద్రప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి చంద్రబాబును బాగా ఇబ్బంది  పెడుతుండగానే తాజాగా ఓ వీడియో వెలుగు చూసింది. ఎప్పుడైతే వీడియో బయటపడిందో చంద్రబాబులో టెన్షన్ మొదలైంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది?


ఏముందంటే, తన అక్రమసంపాదన గురించి, చంద్రబాబు చేసిన పంచాయితీ గురించి స్వయంగా ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డే చెప్పుకున్నారు. జమ్మలమడుగులో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కార్యకర్తలతో మాట్లాడుతూ, తనకు ఎంఎల్సీ రామసుబ్బారెడ్డికి మధ్య ఉన్న అక్రమ సంపాదన గురించి వివరించారు. 


ఎంఎల్సీ చెప్పిన పనుల ద్వారా వచ్చే సంపాదనలో ప్రతీ రూపాయిలో ఎంఎల్సీకి అర్ధరూపాయి ఇవ్వాలట. అదే విధంగా తాను చేసుకునే పనుల్లో వచ్చే ఆదాయంలో కూడా సగభాగం ఎంఎల్సీకి ఇచ్చేయాలన్నారు. ఈ ఒప్పందం స్వయంగా చంద్రబాబే తమ మధ్య కుదిర్చినట్లు చెప్పారు. అందుకు ఇద్దరు ఐఏఎస్ అధికారులే సాక్ష్యులుగా ఉన్నారని మంత్రి చెప్పటం ఇపుడు రాష్ట్రంలో దుమారం రేపుతోంది. ఆడియో, వీడియోలో స్వయంగా మంత్రే చెప్పటంతో చంద్రబాబుకు ఏమి చేయాలో అర్ధం కావటం లేదు.

click me!