
ఏపీలో ఇవాళ్టీ నుంచి రేషన్ షాపులు (pds ration shops) బంద్ (bandh) అయ్యాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా నేటీ నుంచి రేషన్ షాపులు బంద్ చేపట్టారు డీలర్లు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల బంద్‌కు పిలుపునిచ్చింది రేషన్ డీలర్ల అసోసియేషన్ (ration dealers association) . 2020 పీఎంజీకేవై (pmgky) కమీషన్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, డీడీ నగదు వాపసు, ధరల వ్యత్యాస సర్కిలస్‌ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని రేషన్ డీలర్లు కోరుతున్నారు. వీరి నుంచి ఐసీడీఎస్‌కు మళ్లించిన కందిపప్పుకు సంబంధించిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, గోనె సంచులను తిరిగి ప్రభుత్వానికిస్తే రూ.20 చెల్లించాలనే జీవోను అమలు చేయాల్సిందేనని డీలర్లు పట్టుపడుతున్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో (telangana) అది పక్కాగా అమలవుతోందని గుర్తుచేశారు.
Also Read:రేషన్ పై ఏపీకి కేంద్రం ఝలక్: దుకాణాల వద్దే పంపిణీ
తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేదాకా నిరసనలు కొనసాగిస్తామన్న రేషన్ డీలర్లు.. ప్రస్తుతానికి బంద్ వాయిదా వేసినప్పటికీ, దుకాణాల్లో సరుకుల దిగుమతి, పంపిణీనిని నిలిపేస్తున్నామని, అయినాకూడా ప్రభుత్వం దిగిరాకపోతే సంపూర్ణ బంద్ కు దిగుతామని స్పష్టం చేశారు. తొలుత దుకాణాలు అన్నింటినీ బంద్ చేస్తామన్న రేషన్ డీలర్ల సంఘం.. ఆ తర్వాత సవరించుకున్న నిర్ణయాలను నిన్న మీడియాకు వెల్లడించింది. సమస్యలు పరిష్కరించే వరకు ఆంధ్రప్రదేశ్ లో మంగళవారం నుంచి రేషన్ దిగుమతి, పంపిణీని నిలిపేస్తున్నట్లు రేషన్ డీలర్ల సంఘం ప్రకటించింది.