క్షణికావేశంలో మైనర్ బాలికపై అత్యాచారం... భయంతో నిందితుడి ఆత్మహత్యాయత్నం

Published : Sep 19, 2021, 12:53 PM IST
క్షణికావేశంలో మైనర్ బాలికపై అత్యాచారం...  భయంతో నిందితుడి ఆత్మహత్యాయత్నం

సారాంశం

క్షణికావేశంలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తి ఆ తర్వాత భయంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. 

అమరావతి: క్షణికావేశంలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ వ్యక్తి చివరకు తన ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. బాలికపై అత్యాచారం విషయం బయటపడటంతో ఆందోళనకు గురయిన నిందితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.  

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బాలికపై సత్యప్రకాశ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే తాజాగా బాలిక తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే తాను చేసిన నీచమైన పని బయటపడటంతో పరువు పోవడమే కాదు కటకటాలపాలవ్వాల్సి వస్తుందని నిందితుడు సత్యప్రకాశ్ బేంబేలెత్తిపోయాడు. ఈ క్రమంలోనే భయంతో అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురయిన అతడు ప్రస్తుతం ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. 

read more  అమ్మాయితో అక్రమ సంబంధం?: జంగారెడ్డిగూడెంలో అర్థరాత్రి దారుణ హత్య

బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న నిందితుడి ఆరోగ్యం మెరుగుపడగానే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu