ఏపీ స్థానికసంస్థల ఎన్నికలు:మాచర్లలో వైసీపీ క్లీన్‌స్వీప్

By narsimha lodeFirst Published Sep 19, 2021, 12:26 PM IST
Highlights


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది.ఈ నియోజకవర్గంలోని అన్ని స్థానిక సంస్థల్లో వైసీపీ విజయం సాధించింది.

 
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఏకపక్షంగా ఫలితాలను సాధించింది.గుంటూరు జిల్లాలోని మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో  ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకొంది. ఈ నియోజకవర్గంలోని ఐదు జడ్పీటీసీ స్థానాలను వైసీపీ గెలుచుకొంది. 

also read:ఆ ఆరు చోట్ల బ్యాలెట్ పత్రాలు దెబ్బతిన్నాయి: గోపాలకృష్ణ ద్వివేది

నియోజకవర్గంలోని 71 ఎంపీటీసీ స్థానాల్లో కూడ వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించారు.స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ బహిష్కరించింది.  కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్ధులు పోటీ చేశారు.  ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైసీపీ అధికారాన్ని దుర్వినియోగం చేసిందని టీడీపీ సహా విపక్షాలు ఆరోపించాయి. ఈ ఆరోపణలను వైసీపీ కొట్టిపారేసింది.తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారని వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. విపక్షాలకు అందనంత దూరంలో అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు విజయాలను నమోదు చేశారు. ప్రత్యర్ధి పార్టీలు కొన్ని చోట్ల ఒక్క స్థానాన్ని కూడ దక్కించుకొలేకపోయాయి.


 

click me!