టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ఇలాకా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ పాగా వేసింది. చంద్రబాబు సొంత జిల్లాలో కూడా జగన్ నాయకత్వంలోని వైసీపీ దూసుకుపోతోంది.
కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పరిషత్ ఎన్నికల ఫలితాల్లో ముఖ్యమంత్రి వైఎస జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ దూసుకుపోతోంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కనీసం దరిదాపుల్లో కూడా లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి నియోజకవర్గం కుప్పంలో కూడా వైసీపీ తన సత్తా చాటుతోంది. ఈ నియోజకవర్గంలో టీడీపీకి గతంలో గట్టి పట్టు ఉంది.
చిత్తూరు జిల్లా కుప్పం మండలం టీ సడుమూరు ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థిపై వైసీపీ అభ్యర్థి అశ్విని (23) 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దాంతో వైసీపీ కార్యకర్తల ఉత్సాహానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి.
undefined
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో వైసీపీ అత్యధిక స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటోంది. ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం 65 జడ్పీటీసీ స్థానాల్లో 29 స్థానాలను వైసీపీ చేజిక్కించుకుంది. చిత్తూరు జిల్లాలో మొత్తం 841 ఎంపీటీసి స్థానాలు ఉండగా వైసీపీ 416 స్థానాలను దక్కించుకుంది.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు జరుగుతున్న కొద్దీ వైసీపీ గెలిచిన సీట్ల సంఖ్య పెరుగుతూ పోతోంది.