యువతిపై అత్యాచార యత్నం.. సోషల్ మీడియాలో హల్ చల్

Published : Sep 26, 2017, 04:23 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
యువతిపై అత్యాచార యత్నం.. సోషల్ మీడియాలో హల్ చల్

సారాంశం

కనిగిరిలో దారుణం యువతిపై అత్యాచార యత్నం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో

ఓ యువతిపై  యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను అతని స్నేహితులు వీడియో తీసి అనంతరం  ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.  ఈ దారుణ సంఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

అసలేం జరిగిందంటే.. కనిగిరి నగర పంచాయితికి చెందిన యువతి, అదే ప్రాంతానికి చెందిన కార్తీక్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. అయితే.. ఆ యువతిపై గత కొంతకాలంగా కార్తీక్ అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల కనిగిరిలోని సమీపంలో ఉన్న పంటపొల్లాల్లోకి స్నేహితులతో కలిసి యువతిని తీసుకెళ్లాడు. అక్కడ కార్తీక్‌ అత్యంత పైశాచికంగా వ్యవహరించాడు. అమ్మాయిపైకి సాయి అనే యువకుడిని ఉసిగొల్పాడు. సాయి.. యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడుతుండగా కార్తీక్‌, అతని స్నేహితులు తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. యువతికి తోడుగా వచ్చిన మరో విద్యార్థిని ఈ ఘటనను నిలువరించే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది.

 యువతిని వివస్త్రను చేసేందుకు ప్రయత్నించిన దృశ్యాల్ని సెల్‌ఫోన్‌లో వీడియో తీసి ఆ దృశ్యాలను వాట్సాప్‌లో వారి స్నేహితులతో పంచుకున్నారు.  వారి బారి నుంచి ఎట్టకేలకు తప్పించుకున్న యువతి ఘటనపై కనిగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్సై శ్రీనివాసరావు ముగ్గురు విద్యార్థులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందుతుల్లో ఒకరు బీటెక్‌ చదువుతుండగా.. మరో ఇద్దరు డిగ్రీ చదువుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై సర్వత్రా ఆందోళన మొదలైంది. ఆ యువకులకు కఠిన శిక్షలు విధించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

మహానాడు లో మంత్రి నిమ్మల పవర్ ఫుల్ స్పీచ్ | Nimmala Ramanaidu Speech | Asianet News Telugu
అమెరికాలో మహానాడు చంద్రబాబుపై ప్రశంసలు | Mahanadu 2026 | Asianet News Telugu