
Vijayawada: ఆంధ్రప్రదేశ్ లో అమానుష ఘటన జరిగింది. తన కండ్ల ఎదుటే.. తన భర్త మరో మహిళను అత్యాచారం చేస్తుంటే అడ్డుకోవాల్సింది పోయి, అత్యాచారం చేస్తున్న కామాంధుడికి సహకరించింది, ఆపై ఆ దారుణ ఘటనను తన ఫోన్లో చిత్రీకరించిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకెళ్లే.. విజయవాడ నగరంలోని అజిత్‌సింగ్ నగర్ ప్రాంతంలో ఓ మహిళ తన భర్తతో కలిసి నివాసముంటోంది. ఆమె భర్త (25) కేటరింగ్ చేస్తుంటాడు. ఈ నెల 3న ఆమె తన ఇంట్లో పిల్లలతో కలిసి నిద్రపోతుండగా, వీరి ఎదురింట్లో దిలీప్, తులసి అనే భార్యాభర్తలు రాత్రి 11 గంటల సమయంలో ఆమె ఇంట్లోకి ప్రవేశించారు.
వివాహిత నోరు మూసి, తమ ఇంట్లోకి లాక్కెళ్లారు. ఆమెపై భర్త రెండు సార్లు అత్యాచారం చేయగా, అతడి భార్య వీడియో, ఫొటోలు తీసింది. తర్వాతి రోజు కూడా ఆమెను బెదిరించి మరోసారి అత్యాచారం చేశాడు. ఈ దారుణాన్ని ఎవరికైనా చెబితే.. మీ పిల్లలిద్దరినీ చంపేస్తానని బెదిరించారు. అంతేకాకుండా, తన స్నేహితుల కోరిక కూడా తీర్చాలని నిందితుడు పదేపదే వేధిస్తుండడంతో బాధితురాలు మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఘటనపై ఫిర్యాదు చేయగా, నిందితులైన దిలీప్, తులసిపై ఐపీసీ 376(2), 354బి, 354డి, 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.