ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ సభ్యునిగా సోమశంకర్ నాయక్ నియామకం

Published : Feb 08, 2022, 08:27 PM IST
ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ సభ్యునిగా సోమశంకర్ నాయక్ నియామకం

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 2020 డిసెంబర్ 25 నుంచి అమల్లోకి వచ్చింది. తాజాగా, ఈ ఎస్టీ కమిషన్ సభ్యునిగా అనంతపురం జిల్లాకు చెందిన వడిత్యా సోమశంకర్ నాయక్‌ను నియామకం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల కమిషన్(ఎస్టీ కమిషన్) సభ్యునిగా వడిత్యా సోమశంకర్ నాయక్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వడిత్యా సోమశంకర్ నాయక్ అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ వాస్తవ్యుడు. వడిత్యా సోమశంకర్ నాయక్ ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యునిగా నియామకం అయినట్టు రాష్ట్ర గిరిజన్ సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండె వెల్లడించారు. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 41 ద్వారా ఈ ఆదేశాలను ఆయన వెలువరించారు. వడిత్యా సోమశంకర్ నాయక్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్లు రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యునిగా కొనసాగుతారు. 

రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 2020 డిసెంబర్ 25 నుంచి అమల్లోకి వచ్చింది.

ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఆమోదంతో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం.. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్‌లో కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం ఎస్టీల కోసమే ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఆమోదంతో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటయ్యింది. ఈ మేరకు ప్రభుత్వం  ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి  మాట్లాడుతూ, ప్రత్యేక ఎస్టీ కమిషన్ కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. గిరిజనులకు ఇచ్చిన హామీ నెరవేర్చారని, గిరిజన హక్కులు కాపాడేందుకు ఎస్టీ కమిషన్ తీసుకొచ్చారని ఆమె తెలిపారు. సీఎం జగన్‌కు గిరిజనులంతా రుణపడి ఉంటారని పుష్పశ్రీవాణి 2020 డిసెంబర్‌లో అన్నారు.

ఇదిలా ఉండగా, 2021 జులైలో కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు జాతీయ ఎస్టీ కమీషన్ నోటీసులు జారీ చేసింది. నష్టపరిహారం, పునరావాసం కల్పించకుండా పోలవరం నిర్వాసితులను తరలించడంపై జాతీయ ఎస్టీ కమీషన్ స్పందించింది. 15 రోజుల్లో వాస్తవిక నివేదికను ఇవ్వాలని జాతీయ ఎస్టీ కమీషన్ ఆదేశించింది. లేని పక్షంలో సమన్లు జారీ చేస్తామని హెచ్చరించింది. 

కాగా, అదే నెలలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ సందర్భంగా నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న కాలనీలపై అధికారులకు కీలక సూచనలిచ్చారు. పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులన్నీ పూర్తి నాణ్యతతో ఉండాలని సంబంధిత అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఏదో కట్టాం కదా? అన్నట్టు పునరావాస కాలనీలు కట్టకూడదని... కచ్చితంగా నాణ్యత పాటించాలని సీఎం సూచించారు. మొత్తం 90 ఆవాసాల్లో ఈ ఆగస్టు నాటికి 48 ఆవాసాల నుంచి నిర్వాసితులను తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎంకు వివరించారు అధికారులు.

ప్రాజెక్ట్ పనుల పరిశీలన అనంతరం అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పిల్‌వే పనులు దాదాపుగా పూర్తిచేశామని... 48 గేట్లలో 42 గేట్లు అమరిక, మిగిలిన గేట్లను కూడా త్వరలోనే బిగిస్తామని తెలిపిన అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటికే జర్మనీ నుంచి సిలిండర్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఎగువ కాఫర్‌డ్యాంలో అదివరకు ఉన్న ఖాళీలను పూర్తిచేశామన్నారు. అలాగే దిగువ కాఫర్‌డ్యాం పనుల పరిస్థితిని కూడా సీఎంకు వివరించారు అధికారులు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్