రమ్య హత్యకు ముందుగానే స్కెచ్... ఇదీ శశికృష్ణ మర్డర్ ప్లాన్: పోలీస్ దర్యాప్తులో సంచలనాలు

Arun Kumar P   | Asianet News
Published : Aug 19, 2021, 12:36 PM ISTUpdated : Aug 19, 2021, 12:37 PM IST
రమ్య హత్యకు ముందుగానే స్కెచ్... ఇదీ శశికృష్ణ మర్డర్ ప్లాన్: పోలీస్ దర్యాప్తులో సంచలనాలు

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనం రేపిన గుంటూరు దళిత యువతి రమ్య హత్యకేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. తాజాగా రమ్య హత్యకు నిందితుడు ముందుగానే ప్రయత్నించినట్లు బయటపడింది.

గుంటూరు: పట్టపగలే నడిరోడ్డుపై రమ్య అనే దళిత యువతి ప్రేమోన్మాది చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఈ హత్యకు పాల్పడిన నిందితుడు శశికృష్ణను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

రమ్య హత్య క్షణికావేశంలో చేసింది కాదని... ముందస్తు ప్రణాళికతోనే జరిగిందని పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు ముందురోజు శశికృష్ణ రెక్కీ నిర్వహించినట్లు... రమ్య కదలికపై నిఘా పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇలా ముందురోజు చేపట్టిన రెక్కీ ద్వారా సేకరించిన సమాచారం మేరకే రమ్య మర్డర్ కు నిందితుడు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. 

అంతేకాదు అంతకుముందు రమ్య చదివే కాలేజీ వద్ద కూడా నిందితుడు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ నెల 14వ తేదీన బుడంపాడులో రమ్య చదివే కాలేజీవద్దకు వెళ్లాడు నిందితుడు. ఓ స్నేహితుడితో కలిసి ఉదయ బైక్ పై వచ్చిన శశికృష్ణను చూసి భయపడిపోయిన రమ్య కాలేజీలోకి వెళ్లిపోయింది. దీంతో అప్పటికి అక్కడినుండి వెళ్లిపోయిన అతడు తిరిగి సాయంత్రం కాలేజీ వదిలే సమయానికి మళ్లీ కాలేజీ వద్దకు వెళ్లాడు. కానీ అప్పటికే రమ్య వెళ్లిపోవడంతో తిరిగి వెనక్కి వెళ్లిపోయాడని పోలీసుల విచారణలో తేలింది. 

read more  ప్రేమించలేదనే హత్య: బీటెక్ స్టూడెంట్ రమ్యను హత్య చేసిన శశికృష్ణ అరెస్ట్

ఇక 15వ తేదీన రమ్యను హత్య చేయడానికి సిద్దమైన శశికృష్ణ ఓ కత్తిని సమకూర్చుకున్నాడు. ఉదయమే  కాకాని రోడ్డులో రమ్య కోసం మాటు వేశాడు. ఇదే సమయంలో రమ్య టిఫిన్ తీసుకెళ్లడానికి హోటల్ వద్దకు వెళ్లడాన్ని గమనించాడు. ఆమెతో మరోసారి తనను ప్రేమించాలంటూ వాగ్వాదానికి దిగాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో తనవెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పొడిచి పరారయ్యాడు. 

ఇలా రమ్య హత్యకు ముందే స్కెచ్ వేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ముందురోజు రమ్య మర్డర్ కు ప్లాన్ చేసి విఫలమయి  ఆ తర్వాతి రోజు ఆమెను నడిరోడ్డుపైనే చంపేశాడు. తనను ప్రేమించడం లేదన్న కారణంతోనే రమ్యపై కక్ష్య పెంచుకుని మర్డర్ చేసినట్లు నిందితుడు పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?