చంద్రబాబుకు భారీ షాక్: టీడీపీకి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి రాజీనామా?

By telugu teamFirst Published Aug 19, 2021, 12:07 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో ఎదురుదెబ్బ తగులుతోంది. సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీని వీడేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడికి భారీ షాక్ తగలనుంది. రామండ్రి రూరల్ ఎమ్మెల్యే టీడీపీ రాజీనామా చేసే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. చాలా కాలంగా ఆయన చంద్రబాబు తీరు పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు.

టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. 1995 టీడీపీ సంక్షోభంలో ఆయన ఎన్టీఆర్ వెంట ఉన్నారు. ఆ మధ్య ఒక సందర్భంలో టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తారని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు అప్పట్లో చర్చకు దారి తీశాయి. సీనియర్ ఎమ్మెల్యే అయినప్పటికీ చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు.

బుచ్చయ్య చౌదరి నివాసానికి మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. అయితే, ఆ విషయంపై బహిరంగంగా మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. మూడు రోజుల క్రితం తన అభిప్రాయాన్ని పార్టీ నేతలకు తెలిజేసినట్లు తెలుస్తోంది. బుచ్చయ్య చౌదరిని బుజ్జగించడానికి మాజీ మంత్రిలు అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప ప్రయత్నించారు. 

జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే పార్టీ బలోపేతం వస్తుందని బుచ్చయ్య చౌదరి అప్పట్లో వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బుచ్చయ్య చౌదరిపై పార్టీలోని ప్రత్యర్థులు ఫిర్యాదులు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కొంత మంది ఇప్పటికే టీడీపీ దూరమయ్యారు. కరణం బలరాం, వల్లభనేని వంశీ టీడీపీ దూరంగా ఉంటున్నారు. సాంకేతికంగా మాత్రమే వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరలేదు. వారు ప్రస్తుతం వైసీపీలో ఉన్నట్లే.

click me!