విజయవాడలో కలకలం: పార్క్ చేసిన కారులో డెడ్‌బాడీ, మృతుడు ఎవరంటే?

Published : Aug 19, 2021, 12:13 PM ISTUpdated : Aug 19, 2021, 04:09 PM IST
విజయవాడలో కలకలం: పార్క్ చేసిన కారులో డెడ్‌బాడీ, మృతుడు ఎవరంటే?

సారాంశం

విజయవాడలోని మాచవరం పార్క్  చేసిన కారులో మృతదేహం కన్పించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు జి. కొండూరులోని జిక్సిన్ సిలిండర్స్ కంపెనీ యజమానిగా పోలీసులు తెలిపారు. రాహుల్ ఆత్మహత్య చేసుకొన్నాడా, ఎవరైనా ఆయనను హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.  

 విజయవాడ: విజయవాడ మాచవరంలో పార్క్ చేసిన కారులో మృతదేహం కలకలం రేపింది.ఈ మృతదేహన్ని  తాడిగడపకు చెందిన కరణం రాహుల్‌దిగా గుర్తించారు పోలీసులు. మృతుడు జి. కొండూరులోని జిక్సిన్ సిలిండర్స్ కంపెనీ యజమానిగా పోలీసులు తెలిపారు.

వ్యాపారాల్లో విబేధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విబేధాలే ఆయన మరణానికి కారణమయ్యాయా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

రాహుల్ ఆత్మహత్య చేసుకొన్నాడా లేదా ఎవరైనా ఆయనను హత్య చేసి కారులో మృతదేహన్ని వదిలి వెళ్లారా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏపీ 16 ఎఫ్ఎఫ్ 9999 అనే నెంబర్ కారులో రాహుల్ మృతదేహం ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రాహుల్ కన్పించకుండాపోయాడని కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి గుండెసంబంధింత వ్యాధులున్నాయని పోలీసులు చెబుతున్నారు.  డ్రైవింగ్ సీటులోనే ఆయన చనిపోయాడు. గుండెపోటు కారణంగానే ఆయన చనిపోయాడా ఇతరత్రా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పదస్థితి మృతి కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?