పోలీసులు పట్టుకునే క్రమంలో బిటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు నిందితుడు శశికృష్ణ గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్వల్పంగా గాయపడిన శశికృష్ణను పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు.
గుంటూరు: బిటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు నిందితుడు శశికృష్ణ పోలీసులు పట్టుకునే సమయంలో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గొంతు కోసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతను స్వల్పంగా గాయపడ్డాడు. అతన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. శశికృష్ణను పోలీసులు ముప్పాళ్లమండలం గోళ్లపాడు సేఫ్ కంపెనీ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. రమ్య హత్యకు వాడిన కత్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
దళిత విద్యార్థిని రమ్య దారుణ హత్యకు నిరసనగా మంగళగిరి నియోజకవర్గం తెలుగు మహిళ ఆధ్వర్యంలో మంగళగిరి గాంధీ చౌక్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజునే యువతి దారుణ హత్యకు గురి కావడం దారుణమని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు.
Also Read: గుంటూరు రమ్య హత్య కేసు: పోలీసుల అదుపులో నిందితుడు.. గంటల వ్యవధిలోనే పట్టుకున్న ఖాకీలు
దిశ శకటాలకు బహుమతులు ఇవ్వడం కాదు అడబిడ్డలకు భరోసాను, భద్రతను ఇవ్వాలని అన్నారు. దళితులపై నిత్యం హత్యాకాండ, అత్యాచారాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు , హోం మంత్రి సుచరితకు చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు.
ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలోనే, డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతుోదంని వారన్నారు. దిశ పోలీసులు ఏమయ్యారని వారు అడిగారు. రాష్ట్రంలో ఏం జరుగతున్నా కూడా ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రావడం లేదని అన్నారు.