ప్రియురాలిపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టిన రాంబాబు అరెస్ట్: విజయనగరం ఎస్పీ

Published : Aug 20, 2021, 09:22 PM IST
ప్రియురాలిపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టిన రాంబాబు అరెస్ట్: విజయనగరం ఎస్పీ

సారాంశం

 విజయనగరంలో ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు రాంబాబును అరెస్ట్ చేసినట్టుగా విజయనగరం ఎస్పీ తెలిపారు. రాంబాబు ప్రేమించిన యువతితోనే పెళ్లి నిశ్చయమైంది. అయితే  పెళ్లి నిశ్చయమైన తర్వాత వీరిద్దరి మధ్య విబేధాలే ఈ ఘటనకు కారణమయ్యాయని ఎస్పీ పాటిల్ చెప్పారు.  


విజయనగరం: ప్రియురాలిపై పెట్రోల్‌పోసి నిప్పంటించిన  ఘటనలో నిందితుడు రాంబాబును శుక్రవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.ఇవాళ సాయంత్రం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో నిందితుడిని  ఎస్పీ దీపిక పాటిల్ ప్రవేశపెట్టారు. నిందితుడిని కృష్ణాపురంలో అరెస్ట్ చేశామన్నారు. 

also read:విజయనగరంలో ప్రియురాలికి నిప్పు... దిశ యాప్ వల్లే యువతిని కాపాడాం: మంత్రి శ్రీవాణి (వీడియో)

ఇద్దరి మధ్య వివాహం కుదిరిన తర్వాత  చోటు చేసుకొన్న అనుమానాలే ఈ ఘటనకు కారణమయ్యాయని ఎస్పీ చెప్పారు. ఈ కేసులో మరికొందరు అనుమానితులను కూడా విచారించాల్సిన అవసరం ఉందని  ఎస్పీ తెలిపారు.

ఈ ఘటనపై  బాధితులకు సకాలంలో వైద్య అందించడంలో దిశ యాప్ కీలకపాత్ర పోషిస్తోందని ఎస్పీ చెప్పారు. దాడిని అడ్డుకోబోయిన వారికి కూడ గాయాలయ్యాయని ఎస్పీ తెలిపారు. బాధితురాలికి చికిత్స అందిస్తున్నామని ఎస్పీ వివరించారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్
Chitha Vijay Prathap Reddy: ఫుడ్ కమిషన్ చైర్మన్ కే పంచ్ లు నవ్వు ఆపుకోలేకపోయిన అధికారులు| Asianet