23న ఫలితాలు: జగన్‌ని ఆశీర్వదించిన రమణ దీక్షితులు

Siva Kodati |  
Published : May 16, 2019, 06:46 PM IST
23న ఫలితాలు: జగన్‌ని ఆశీర్వదించిన రమణ దీక్షితులు

సారాంశం

గురువారం తన నియోజకర్గానికి వచ్చిన జగన్ నేతలు, కార్యకర్తలతో మంతనాలు జరిపారు. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు.. జగన్‌ను కలిశారు

ప్రచారం, ఎన్నికల వ్యవహారాల్లో తలమునకలైన వైసీపీ చీఫ్ వైఎస్ జగన్.. ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి విహారయాత్రలు, సినిమాలతో సేద తీరారు. కాగా, కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో తిరిగి ఆయన రాజకీయ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు.

గురువారం తన నియోజకర్గానికి వచ్చిన జగన్ నేతలు, కార్యకర్తలతో మంతనాలు జరిపారు. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు.. జగన్‌ను కలిశారు.

ఈ సందర్భంగా రమణ దీక్షితులు.. ఆయనకు ఆశీస్సులు అందించారు. కొద్దిరోజుల్లో ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో వీరి కలయిక రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా మూడు రోజులు పర్యటనలో భాగంగా జగన్ పులివెందులలోని పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?