కేకలు వేశారు, రాం మాధవ్ ను అవమానించలేదు: తానా

By telugu teamFirst Published Jul 9, 2019, 7:49 AM IST
Highlights

మంగళవాయిద్యాలతో రామ్ మాధవ్ కు ఘనస్వాగతం పలికి, వేదికపై ప్రముఖ స్థానం కల్పించామని వేమన సతీష్, డాక్టర్‌ మూల్పూరి వెంకటరావు తెలిపారు. 22వ తానా సభలకు అన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రతినిధులను ఆహ్వానించినట్లు వారు తెలిపారు.

వాషింగ్టన్ డీసీ: తాము బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను అవమానించలేదని తానా అధ్యక్షుడు వేమన సతీష్, సభల సమన్వయ కర్త డాక్టర్ మూల్పూరి వెంకటరావు స్పష్టం చేశారు. వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన తమ సభల్లో రామ్ మాధవ్ ను అవనమానించినట్లు వార్తల్లో నిజం లేదని వారు స్పష్టం చేశారు.

మంగళవాయిద్యాలతో రామ్ మాధవ్ కు ఘనస్వాగతం పలికి, వేదికపై ప్రముఖ స్థానం కల్పించామని వేమన సతీష్, డాక్టర్‌ మూల్పూరి వెంకటరావు తెలిపారు. 22వ తానా సభలకు అన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రతినిధులను ఆహ్వానించినట్లు వారు తెలిపారు. అందరికీ సమున్నత రీతిలో సమాదరణ కల్పించామని చెప్పారు. 

రాంమాధవ్‌ ప్రసంగానికి 15 నిమిషాలు కేటాయించామని, 12వ నిమిషంలో ఆయన మాట్లాడుతుండగా తానా సభలకు వచ్చిన అతిథుల్లో చివరి వరుసలో కూర్చున్న కొందరు కేకలు వేశారని వారు తెలిపారు. దేశంలోనే శక్తిమంతమైన తెలుగువారిలో ఒకడిగా రామ్ మాధవ్ ను సభకు పరిచయం చేశామని చెప్పారు. 

కాగా, తానా నూతన అధ్యక్షుడిగా తాళ్లూరి జయశేఖర్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బూర్గంపాడుకు చెందిన జయశేఖర్‌ ఇంజనీరింగ్‌ పట్టభద్రులు.

సంబంధిత వార్త

తానా సభల్లో బిజెపి నేత రామ్ మాధవ్ కు చేదు అనుభవం

click me!