విశాఖ జిల్లాలో బస్సు బోల్తా: ముగ్గురి దుర్మరణం

Siva Kodati |  
Published : Jul 09, 2019, 07:39 AM IST
విశాఖ జిల్లాలో బస్సు బోల్తా: ముగ్గురి దుర్మరణం

సారాంశం

విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. 

విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన కొంతమంది.. ఒడిశాలోని రాయ్‌గఢ్‌లోని మజ్జిగౌరమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు.

వీరంతా తిరిగి కాకినాడ వస్తుండగా.. విశాఖ జిల్లా పాడేరు మండలం వంట్ల మామిడి ఘాట్‌రోడ్‌లో వీరు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైన మరో నలుగురిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కాగా.. ప్రమాద సమయంలో  వర్షం పడటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది.                           

PREV
click me!

Recommended Stories

YS Jagan Strong Warning: మనం విలీనం చెయ్యకపోతే చంద్రబాబు ఆర్టీసీ ని అమ్మేసేవారు| Asianet News Telugu
YS Jagan Speech: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ఒక పెద్ద స్కామ్‌ | YSRCP | Asianet News Telugu