పవన్‌తో రామ్ మాధవ్ భేటీ: ఎవరైనా రావొచ్చు, జనసేనానిపై కీలక వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Jul 7, 2019, 11:31 AM IST
Highlights

 తమ పార్టీలో చేరి పనిచేయాలనుకొనే వారికి స్వాగతం చెబుతున్నామని బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్ స్పష్టం చేశారు. తానా సభల్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో రామ్ మాధవ్  బేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన  ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.


వాషింగ్టన్ డీసీ: తమ పార్టీలో చేరి పనిచేయాలనుకొనే వారికి స్వాగతం చెబుతున్నామని బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్ స్పష్టం చేశారు. తానా సభల్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో రామ్ మాధవ్  బేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన  ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

దేశంలో  మోడీ పాలనను చూసి అనేక మంది తమ పార్టీలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారని  ఆయన చెప్పారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో స్నేహా పూర్వకంగానే భేటీ అయినట్టుగా ఆయన వివరించారు. తమ భేటీలో ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేవన్నారు.

ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్‌తో  కలిసి పనిచేసే ఉద్దేశ్యం తమకు లేదని  ఆయన తేల్చి చెప్పారు.  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో  బలోపేతం కావడం కోసం తాము కేంద్రీకరించి పని చేస్తున్నామని రామ్ మాధవ్ తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్‌తో భేటీలో రాజకీయాల ప్రస్తావనే లేదన్నారు రామ్ మాధవ్. ఏపీలో జగన్ పాలనపై ఇద్దరు నేతలు చర్చించుకొన్నారని ప్రచారం సాగుతోంది.

సంబంధిత వార్తలు

పవన్‌తో బీజేపీ నేత రామ్‌మాధవ్ భేటీ: మతలబు ఏమిటి
 

click me!