మూక దాడుల తరహలోనే ఏపీపై కేంద్రం దాడి: సుజనా తీవ్ర విమర్శలు

First Published Jul 24, 2018, 2:25 PM IST
Highlights

మూకదాడుల తరహాలోనే కేంద్రం ఏపీ రాష్ట్రంపై దాడికి దిగిందని మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆరోపించారు.  నాలుగేళ్లుగా కేంద్రం ఏపీ రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఎదురుచూశారని ఆయన చెప్పారు.


న్యూఢిల్లీ: మూకదాడుల తరహాలోనే కేంద్రం ఏపీ రాష్ట్రంపై దాడికి దిగిందని మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆరోపించారు.  నాలుగేళ్లుగా కేంద్రం ఏపీ రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఎదురుచూశారని ఆయన చెప్పారు.

రాజ్యసభలో మంగళవారం నాడు ఏపీకి ప్రత్యేక హోదా, ఏపి విభజన హమీ చట్టంపై స్వల్పకాలిక  చర్చను ఆయన ప్రారంభించారు.  విభజన హామీని ఇంతవరకు అమలు చేయలేదన్నారు.  ప్రత్యేక హోదా హమీ ఇస్తామని  ఎన్నికల ప్రచారంలో ఏపీలో  మోడీ ప్రచారం చేసిన విషయాన్ని సుజనా చౌదరి గుర్తు చేశారు. 

సహకార స్పూర్తికి కేంద్రం విఘాతం కల్గించిందని ఆయన ఆరోపించారు.ఏపీ ప్రజల భవిష్యత్‌ అంధకారంలో పడిందని చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు.

మంత్రివర్గ నిర్ణయాలు చట్టబద్దమైనవి... వాటిని అమలు చేయాల్సిన  కేంద్రం తుంగలో తొక్కిందన్నారు.  మంత్రివర్గంలో తీసుకొన్న నిర్ణయాలను తుంగలో తొక్కారని ఆయన విమర్శలు గుప్పించారు.

ఏపీ ప్రజల భవితవ్యం అంధకారంలో పడిందన్నారు. యూపీఏ హయాంలో ఇచ్చిన హమీని అమలు చేయలేదన్నారు. రాజ్యసభలో ఇచ్చిన హమీలను అమలు చేయలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

రాజ్యసభలో ఇచ్చిన హమీలు, చట్టాలు అమలు చేయడం లేదని ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు.  కేంద్రం తన అధికారంతో  ఏపీకి రావాల్సిన  అన్ని వనరులను అడ్డుకొంటుందన్నారు. 

16 వేల కోట్ల రెవిన్యూ లోటుతో రాష్ట్రం విడిపోయినా కేంద్రం కేవలం 4 వేల కోట్లు మాత్రమే అంటుందని సుజనా చెప్పారు.  ప్రత్యేక హోదాపై 14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

click me!