ఏపీలో రాజ్యసభ సీట్లు వైసీపీ ఖాతాలోకే ! సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం !!

By SumaBala Bukka  |  First Published Feb 15, 2024, 12:04 PM IST

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. మూడు సీట్లకు మూడు నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో పోటీ లేకుండా పోయింది. 


అమరావతి : దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. కాగా, ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. వీటికి, కేవలం వైఎస్ఆర్సిపి నుంచి ముగ్గురు మాత్రమే నామినేషన్లు వేశారు. వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావులు వైసీపీ రాజ్యసభ అభ్యర్థులుగా రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. కాగా రాజ్యసభ రేసు నుంచి తాము వైదలుకుతున్నట్లుగా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తెలిపింది.

తాము రాజ్యసభ రేసుకు దూరంగా ఉండబోతున్నట్లు నిర్ణయించినట్లుగా టిడిపి తమ నేతలకు క్లారిటీ ఇచ్చింది. వేరే నామినేషన్లు లేకపోవడంతో ఈ ముగ్గురి ఎంపిక ఏకగ్రీవం కానుంది. దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటుందనుకున్న తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా బరిలోకి దిగి అభ్యర్థిని గెలిపించుకుంది. ఈసారి కూడా అలాగే జరుగుతుందని అనుకున్నారు. రాజ్యసభ ఎన్నికల విషయంలో టిడిపి ఏ నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొన్న సమయంలో.. వీటికి దూరంగా ఉండాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్లుగా ప్రకటించారు.

Latest Videos

ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్దం: సుప్రీం సంచలన తీర్పు

దీనికోసం వైసిపి రెబల్ ఎమ్మెల్యే లతో పాటు, సీట్లు చక్కని సీటింగులు, మరికొందరు ఎమ్మెల్యేలు వైసిపితో అసంతృప్తితో ఉన్నారని.. వీటన్నింటినీ క్యాష్ చేసుకోవడానికి టిడిపి రాజ్యసభ పోటీలో తన అభ్యర్థిని దింపుతుందని ప్రచారం జోరుగా సాగింది.  అయితే తమకు బలం లేకపోవడం వల్ల బరిలోకి దిగి బంగపడడం కంటే దూరంగా ఉండటమే ఉత్తమమని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా పార్టీ సీనియర్ల సమావేశంలో చంద్రబాబునాయుడు ప్రకటించారట. టిడిపి రేసులో నుంచి తప్పుకోవడంతో.. రాజ్యసభ సీట్లు 3 వైసీపీకే  దక్కనున్నాయి.

click me!