ఆస్తుల పంపకాలపై ఏపీ పిటిషన్‌పై విచారణ.. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం..

Published : Jan 09, 2023, 01:07 PM IST
ఆస్తుల పంపకాలపై ఏపీ పిటిషన్‌పై విచారణ.. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం..

సారాంశం

రాష్ట్ర పునర్విభజన చట్టం, ఆస్తుల పంపకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఈరోజు విచారణ జరిగింది.

రాష్ట్ర పునర్విభజన చట్టం, ఆస్తుల పంపకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ పిటిషన్‌లో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలను ఏపీ ప్రభుత్వం ప్రతివాదులుగా చేర్చింది. అయితే ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరగగా.. తెలంగాణ, కేంద్రం తరఫున న్యాయవాదులు హాజరుకాలేదు. ఈ క్రమంలోనే తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అదే సమయంలో కౌంటర్‌పై రిజాయిండర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. 

ఇక, ఏపీ సర్కార్ తన పిటిషన్‌లో.. షెడ్యూల్ 9, 10 ల అంశాలు పరిష్కారం కాకపోవడంతో ఏపీ నష్టపోతుందని పేర్కొంది. విభజన అంశాల పరిష్కారంపై తెలంగాణ స్పందించకపోవడం ఏపీ ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని తెలిపింది. ఆస్తులలో 91 శాతం హైదరాబాద్‌లో ఉన్నందున ఆస్తుల విభజన జరగకపోవడం వల్ల తెలంగాణకు ప్రయోజనం చేకూరిందని పేర్కొంది. ఆస్తుల విభజన న్యాయబద్దంగా జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే