నాలుగేళ్లు నమ్మించి.. ఆటోడ్రైవర్ చేసిన ఘాతుకం.. !!

By AN TeluguFirst Published Mar 27, 2021, 1:00 PM IST
Highlights

అమ్మా.. ఎక్కడికి వెళ్లాలి.. రమ్మంటారా.. బ్యాంకుకా పదండి వెళ్దాం.. అంటూ నమ్మకస్తుడిగా నటించిన ఓ ఆటో డ్రైవర్ చివరికి ఆ వృద్ధురాలిని హత్యచేసి బంగారం కాజేశాడు. అప్పులు తీర్చడానికే ఈ దారుణానికి ఒడిగట్టాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కి కటకటల పాలయ్యాడు. 

అమ్మా.. ఎక్కడికి వెళ్లాలి.. రమ్మంటారా.. బ్యాంకుకా పదండి వెళ్దాం.. అంటూ నమ్మకస్తుడిగా నటించిన ఓ ఆటో డ్రైవర్ చివరికి ఆ వృద్ధురాలిని హత్యచేసి బంగారం కాజేశాడు. అప్పులు తీర్చడానికే ఈ దారుణానికి ఒడిగట్టాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కి కటకటల పాలయ్యాడు. 

నిందితుడి నుంచి పోలీసులు 116 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు రాజమహేంద్రవరం అర్భన్ ఏఎస్పీ ఎ.లతామాధురి తెలిపారు. దీని మీద శుశ్రవారం బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు తెలిపారు. 

దీని ప్రకారం.. గత నెల 4వ తేదీ రాత్రి హుకుంపేట ఆదర్శనగర్ లో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలు జంగా నారాయణమ్మ (60) హత్యకు గురైంది. ఇంటిదగ్గర ఎవ్వరూ లేని టైం చూసి ఆమె ముక్కు, నోరు మూసేసి హత్య చేశాడు. ఆ తరువాత ఆమె దగ్గరున్న బంగారు ఆభరణాలు దొంగిలించాడు. ఈ మేరకు ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ కె.లక్ష్మణరెడ్డి కేసు నమోదు చేశారు. 

అర్బన్‌ ఎస్పీ శేమూషీ బాజ్‌పాయ్‌ ఆదేశాల మేరకు అడిషనల్‌ ఎస్పీ లా అండ్‌ ఆర్డర్, ఈస్ట్‌జోన్‌ డీఎస్పీ రవికుమార్‌ పర్యవేక్షణలో బొమ్మూరు, రాజానగరం ఇన్‌స్పెక్టర్లు లక్ష్మణరెడ్డి, సుభాష్‌లు, ఎస్సైలు దర్యాప్తు చేపట్టారు. అనుమానం వచ్చిన హుకుంపేట ఆదర్శనగర్ పార్కు దగ్గర ఉంటున్న ఆటో డ్రైవర్ చుక్కా లోవరాజును ఆవ రోడ్డులో బొమ్మూరు బొమ్మూరు ఇన్‌స్పెక్టర్లు లక్ష్మణరెడ్డి అరెస్టు చేశారు.

అతన్ని విచారించగా అసలు విషయాలు బైటికి వచ్చాయి. లోవరాజు సొంతూరు విజయవాడ. అక్కడ గతంలో అతనిపై దొంగతనాల కేసులున్నాయి. పదేళ్ల కిందట ఆయన రాజమహేంద్రవరానికి వచ్చి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. 

హత్యకు గురైన జంగా నారాయణమ్మకు లోవరాజు ఆటోడ్రైవర్ గా పరిచయమయ్యాడు. ఆమెకు నమ్మకస్తుడిగా ఉంటూ సుమారు నాలుగేళ్లనుంచి ఆస్పత్రులు, బ్యాంకు పనులు, దేవాలయాలు, బంధువుల ఇళ్లకు తన ఆటోలో కిరాయికి తిప్పుతూ ఉండేవాడు. 

ఈ క్రమంలో నారాయణమ్మ ఒంటరిగా ఉంటుందని, ఆమె వద్ద బంగారం ఉందని గమనించాడు. అది దొంగిలిస్తే తన అప్పులు, కుటుంబ అవసరాలు తీరతాయనుకున్నాడు. దీంతో హత్యకు పథకం వేశాడు. గత నెల 4న నారాయణమ్మను హత్య చేసి, ఒంటి మీద బంగారాన్ని దోచుకున్నాడు. 

ఈ కేసులో చివరికి నిందితుడిని అరెస్ట్ చేసి సుమారు రూ. 4 లక్షల విలువైన 116 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఏఎస్పీ లతామాధురి తెలిపారు. 

click me!