బావను హత్య చేసిన బావమరిది.. సోదరితో గొడవ పడ్డాడని...

Published : Mar 27, 2021, 10:33 AM ISTUpdated : Mar 27, 2021, 10:42 AM IST
బావను హత్య చేసిన బావమరిది.. సోదరితో గొడవ పడ్డాడని...

సారాంశం

భార్యాభర్తల గొడవ చివరికి హత్యకు దారి తీసింది. సోదరి భర్త అని కూడా చూడకుండా సొంత బావమీదే కత్తితో దాడి చేసి చంపేశాడో బావమరిది. ఈ దారుణమైన ఘటన క్రిష్ణా జిల్లా, జగ్గయ్య పేటలో శుక్రవారం కలకలం రేపింది. 

భార్యాభర్తల గొడవ చివరికి హత్యకు దారి తీసింది. సోదరి భర్త అని కూడా చూడకుండా సొంత బావమీదే కత్తితో దాడి చేసి చంపేశాడో బావమరిది. ఈ దారుణమైన ఘటన క్రిష్ణా జిల్లా, జగ్గయ్య పేటలో శుక్రవారం కలకలం రేపింది. 

వివరాల్లోకి వెడితే.. తొర్రకుంటపాలెం గ్రామానికి చెందిన తాటి సురేష్ (40)లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన శ్యామలను పదిహేనేళ్ల క్రితం ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. 

అయితే గత కొంతకాలం నుంచి భార్యభర్తల మధ్య మనస్పర్థలు వస్తున్నాయి. పెద్దలు కలగచేసుకుని రాజీ చేశారు. ఈ క్రమంలో ఈనెల 19న మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంలో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. 

గురువారం రాత్రి 12 గంటల సమయంలో సురేష్ భార్య కోసం ఆమె పుట్టింటికి వెళ్లాడు. అయితే ఆ సమయంలో భార్య ఇంట్లో లేదు. దీంతో భార్య సోదరుడు గుడిశ కిషోర్ కు సురేష్ కుమధ్య మాటా మాటా పెరిగి, ఘర్ణణకు దారి తీసింది. దీంతో కోపోద్రిక్తుడైన కిశోర్ కత్తితో సురేష్ మీద దాడి చేశాడు. సురేష్ అక్కడికక్కడే పడిపోయాడు. 

ఇది గమనించిన స్థానికులు సురేష్ ను జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు విజయవాడ తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ సురేస్ చనిపోయాడు. నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెండి ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. మృతుని తండ్రి పరమేశ్వరరావు ఫిర్యాదు మేరకు సీఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కిషోర్ పరారీలో ఉన్నాడు. 
 

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్