పవన్‌ భార్యలే తేల్చుకోవాలి: జగ‌న్‌కు ఉండవల్లి కౌంటర్

Published : Jul 25, 2018, 04:41 PM ISTUpdated : Jul 25, 2018, 04:54 PM IST
పవన్‌ భార్యలే తేల్చుకోవాలి: జగ‌న్‌కు ఉండవల్లి కౌంటర్

సారాంశం

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ పై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ చేసిన వ్యక్తిగత విమర్శలు సరైనవి కావని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.ఈ వ్యాఖ్యలను జగన్ చేసినట్టుగా తాను పత్రికల్లో చూశాననని ఆయన చెప్పారు

న్యూఢిల్లీ: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ పై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ చేసిన వ్యక్తిగత విమర్శలు సరైనవి కావని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.ఈ వ్యాఖ్యలను జగన్ చేసినట్టుగా తాను పత్రికల్లో చూశాననని ఆయన చెప్పారు. ఈ రకమైన వ్యాఖ్యలు రాజకీయాలను కలుషితం చేయడమేనన్నారు.

బుధవారం నాడు  ఆయన  న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.  రాజకీయ నేతలుగా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. పవన్ కళ్యాణ్‌కు ఎంతమంది భార్యాలుంటే... ఆ భార్యలే తేల్చుకోంటారని... ఇతరులు ఆ విషయంలో జోక్యం చేసుకోకూడదనేది చట్టం చెబుతోందని  ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.

పవన్‌కళ్యాణ్ భార్యల విషయంలో జగన్ విమర్శల నేపథ్యంలో ఆయన మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ విషయంలో ఇతరుల జోక్యం పనికిరాదన్నారు. అవసరమైతే  పవన్ కళ్యాణ్ మొదటి భార్య కోర్టుకు వెళ్లొచ్చన్నారు. వ్యక్తిగతంగా ఇలా విమర్శలు చేయడం తొలిసారిగా తాను భావిస్తున్నట్టు ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.

ఒకవేళ గతంలో  ఈ రకమైన విమర్శలు తాను ఎప్పుడూ కూడ వినలేదన్నారు.  అలా విమర్శలు చేస్తే దాన్ని తప్పేనని ఆయన చెప్పారు.ఈ రకమైన వ్యక్తిగత విమర్శలు రాజకీయాలను కలుషితం చేయడమేనని ఉండవల్లి అరుణ్ కుమార్  చెప్పారు..

ఈ రకమైన వ్యక్తిగత విమర్శలు రెండు పార్టీలకు ఆరోగ్యకరం కాదని ఉండవల్లి అరుణ్ కుమార్  అన్నారు.జగన్ పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలకు సంబంధించిన వీడియో తాను చూడలేదన్నారు. కానీ, ఈ విషయమై పత్రికల్లో వచ్చిన వార్తలను చదివినట్టు ఆయన గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలు తప్పేనని చెప్పారు.

 

 

PREV
click me!

Recommended Stories

BR Naidu Press Meet: దేశం లోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తిరుపతి స్విమ్స్: బీఆర్ నాయుడు| Asianet Telugu
Swathi Deekshith & Pranavi Manukonda Visit Tirumala Temple: శ్రీవారిసేవలో ప్రముఖులు | Asianet Telugu