తుని రైలు దగ్దం కేసు: ముద్రగడకు కోర్టు షాక్

Published : Feb 26, 2021, 01:37 PM IST
తుని రైలు దగ్దం కేసు: ముద్రగడకు కోర్టు షాక్

సారాంశం

తూర్పుగోదావరి జిల్లాలోని తుని రైలు దహనం ఘటనలో కాపు ఉద్యమ నేత ముద్రగడతో సహా, నిందితులకు విజయవాడ రైల్వే కోర్టు షాక్ ఇచ్చింది. 

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని తుని రైలు దహనం ఘటనలో కాపు ఉద్యమ నేత ముద్రగడతో సహా, నిందితులకు విజయవాడ రైల్వే కోర్టు షాక్ ఇచ్చింది. 

ఈ ఏడాది మార్చి 3న కోర్టుకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది కోర్టు. 2016 జనవరి 31న తుని వద్ద రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు దహనం జరిగింది. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ముద్రగడ పద్మనాభం ఆందోళన నిర్వహణ సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

ఈ రైలు దగ్దం కేసుపై రైల్వే చట్టంలోని 146, 147, 153, 174 సెక్షన్ల కింద పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముద్రగద పద్మనాభంతో పాటు సుధాకర్ నాయుడు తదితరులపై  కేసు నమోదైంది.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపులకు ఇచ్చిన హమీని అమలు చేయాలని కోరుతూ ఈ ఆందోళనకు కాపు రిజర్వేషన్ పోరాట సమితి చేపట్టింది. తుని రైలు దగ్దం ఘటనపై ఏపీలో అప్పట్లో సంచలనం కల్గించింది. 
 

PREV
click me!

Recommended Stories

Smart Kitchen Project for Schools | CM Appreciates Kadapa District Collector | Asianet News Telugu
Roop Kumar Yadav Serious Comments Anil Kumar Yadav | Nellore Political Heat | Asianet News Telugu