ఏపీలో మున్సిపల్ ఎన్నికలు: ఈ నెల 27 నుండి ఎస్ఈసీ ప్రాంతీయ సమావేశాలు

By narsimha lodeFirst Published Feb 26, 2021, 1:07 PM IST
Highlights

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్  నిర్ణయం తీసుకొన్నారు.

అమరావతి: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్  నిర్ణయం తీసుకొన్నారు.

ఈ నెల 27 నుండి మూడు రోజుల పాటు ప్రాంతీయ సమావేశాలు నిర్వహించాలని తలపెట్టారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులతో సమావేశమై ఎన్నికల నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలపై ఎస్ఈసీ దిశానిర్ధేశం చేయనున్నారు.

మున్సిపల్ ఎన్నికల విషయమై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఈసీ సేకరించనున్నారు. ఈ నెల 27న తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో సెనేట్ హాల్ లో చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూల్, నెల్లాల అధికారులతో సమావేశం కానున్నారు. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

ఆ తర్వాత అనంతపురం జిల్లాల్లో ఐదు జిల్లాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో ఎస్ఈసీ సమావేశం కానున్నారు.  ఈ నెల 28న విజయవాడలోని తన కార్యాలయంలో ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల అధికారులతో ఎస్ఈసీ సమావేశం కానున్నారు.  అదే రోజు మధ్యాహ్నం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులతో సమావేశం కానున్నారు. అదే రోజున సాయంత్రం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమౌతారు.

also read:ఏపీ మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్: పిటిషన్లను కొట్టేసిన ఏపీ హైకోర్టు

మార్చి 1న విశాఖపట్టణంలో మూడో రీజినల్ సమావేశం అధికారులతో సమావేశం కానున్నారు. తూర్పుగోదావరి, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికారులతో సమావేశం కానున్నారు. అదే రోజున మధ్యాహ్నం 3 గంటల నుండి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పటిష్ట భద్రత, నిఘా ఏర్పాటు, మధ్యం సరఫరా నివారణ, ఓటరు స్లిప్పుల పంపిణీ తదితర అంశాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు.పోలింగ్ నిర్వహణతో పాటు కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇతర అంశాలపై ఎస్ఈసీ అధికారులకు దిశానిర్ధేశం చేస్తారు.
 

click me!