ఈ నెల 18న ఏపీకి రాహుల్ గాంధీ.. కర్నూలులో భారీ బహిరంగసభ

By sivanagaprasad KodatiFirst Published 4, Sep 2018, 2:38 PM IST
Highlights

చాలాకాలం తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఈ నెల 18న ఆయన కర్నూలుకు రానున్నట్లుగా ఏపీసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు

చాలాకాలం తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఈ నెల 18న ఆయన కర్నూలుకు రానున్నట్లుగా ఏపీసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.

రాహుల్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించడానికి ఈ నెల 6న కర్నూలుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు రానున్నట్లుగా పేర్కొన్నారు. అక్కడ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు దామోదరం సంజీవయ్య స్మారక భవనాన్ని ఏర్పాటు చేయడానికి స్థల పరిశీలన చేస్తారని.. అనంతరం విద్యార్థులతో ముఖాముఖీ, సీనియర్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారని తెలిపారు.

Last Updated 9, Sep 2018, 1:22 PM IST