ఏపీ కాంగ్రెస్‌పై రాహుల్ ఫోకస్..కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపై కసరత్తు

Siva Kodati |  
Published : Aug 28, 2021, 06:22 PM IST
ఏపీ కాంగ్రెస్‌పై రాహుల్ ఫోకస్..కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపై కసరత్తు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారు రాహుల్‌ గాంధీ… ఇప్పటికీ ఈ నెల 11న ఏపీ కాంగ్రెస్ నేతలతో వరుస భేటీలు జరిపారు. విడివిడిగా ఏపీ సీనియర్ నేతలతో ముఖాముఖి సమాలోచనలు జరుపుతున్నారు రాహుల్ గాంధీ. ముఖ్యంగా పీసీసీ నూతన అధ్యక్షుడు నియామకంపై రాహుల్ చర్చలు జరపనున్నారు.

పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర నేతల ఆలోచనలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకోనున్న ఆయన.. రాష్ట్ర నేతల అభిమతం తెలుసుకున్న తర్వాత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.. కేంద్ర మాజీ మంత్రి డా. చింతా మోహన్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు తదితరులతో మంతనాలు జరుపుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బలమైన, ప్రజల్లో మంచి క్రేజ్ వున్న నేతను పీపీసీ అధ్యక్షుడిగా నియమించాలని హైకమాండ్ భావిస్తోంది.

కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బలంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. తెలంగాణ ఏర్పాటు తర్వాత తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయింది.. కష్టసమయంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి లాంటివారు పార్టీ పగ్గాలు తీసుకుని లాక్కొచ్చారు.. ఆ తర్వాత శైలజానాథ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని నియమించడంతో.. పార్టీలో కొత్త ఊపు వచ్చింది.. ఈ నేపథ్యంలో ఏపీలో పార్టీలో జోష్‌ పెంచాలంటే ఏం చేయాలని అనేదానిపై దృష్టిసారించారు రాహుల్ గాంధీ.

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan Speech: కాకినాడ లో డిప్యూటీ సీఎం పవన్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
CM Chandrababu Spech: మీ భూమి మీ హక్కు రాజ ముద్రతో పట్టా ఇస్తా | Asianet News Telugu