వివేకా హత్య కేసు: ఆనాటి పోస్ట్‌మార్టం రిపోర్ట్‌పై ఫోకస్.. డాక్టర్‌ను పిలిచిన సీబీఐ

Siva Kodati |  
Published : Aug 28, 2021, 03:41 PM IST
వివేకా హత్య కేసు: ఆనాటి పోస్ట్‌మార్టం రిపోర్ట్‌పై ఫోకస్.. డాక్టర్‌ను పిలిచిన సీబీఐ

సారాంశం

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో భాగంగా ఇవాళ కడప రిమ్స్‌ డాక్టర్‌ ఆనంద నాయక్‌ను సీబీఐ అధికారులు విచారించారు. వివేకా మృతదేహానికి ఆనంద నాయకే పోస్టుమార్టం నిర్వహించారు. కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు వివేకా పోస్టుమార్టం నివేదికను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు. 

మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 83వ రోజు కొనసాగుతోంది. దీనిలో భాగంగా కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ అధికారులు ఇవాళ కడప రిమ్స్‌ డాక్టర్‌ ఆనంద నాయక్‌ను విచారించారు. వివేకా మృతదేహానికి ఆనంద నాయకే పోస్టుమార్టం నిర్వహించారు. కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు వివేకా పోస్టుమార్టం నివేదికను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అధికారులు డాక్టర్‌ను ప్రశ్నించినట్లు సమాచారం.  

మరోవైపు వైఎస్ వివేకాను హత్య చేసినవారిని పట్టిస్తే రూ. 5 లక్షల నజరానా ఇస్తామని సిబిఐ ప్రకటించింది. నిందితుల ఆచూకీ తెలపాలని సిబిఐ ఆ ప్రకటనలో కోరింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చిందని అనుకుంటున్న సమయంలో సిబిఐ ఆ ప్రకటన చేసింది. దాంతో అది చర్చకు దారి తీసింది. ఈ కేసులో సిబిఐ ఇప్పటికే సునీల్ యాదవ్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. నిందితులకు సంబంధించిన పక్కా సమాచారం అందించినవారికి మాత్రమే అవార్డు ఇస్తామని సిబిఐ ప్రకటించింది. సమాచారం ఇచ్చినవారి పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పింది.

ALso Read:వైఎస్ వివేకా హంతకులను పట్టిస్తే రూ. 5 లక్షల నజరానా: సీబీఐ ప్రకటన

వందల మందిని విచారించింది. దాదాపు 70 రోజులుగా దర్యాప్తు సాగిస్తోంది. సిబిఐ తాజా ప్రకటనతో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ముందుకు సాగలేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు విజ్ఞప్తితో సిబిఐ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు విచారించారు.
 

PREV
click me!

Recommended Stories

Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?