సైకిల్ కు సైకిల్ తో నే సమాధానం

Published : Feb 04, 2017, 09:11 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
సైకిల్ కు సైకిల్ తో నే సమాధానం

సారాంశం

 ఇక ముందంతా బిజెపి, టిడిపి అబద్ధాలపై ఉద్యమించడమే. 2017 కాంగ్రెస్ కు పోరాట నామ సంవత్సరం

మామూలుగాప్రతి పక్ష పార్టీ ప్రజాసమస్య మీద ఉద్యమిస్తుంటాయ. ఇందులో ఆంధ్ర కాంగ్రెస్ భిన్నం. అసెంబ్లీలో చోటు దక్కకపోయినా,  ఆ పార్టీ గత రెండున్నరేళ్లలో   ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టి హౌస్ లేకున్నా ఫీల్డ్ లో మాత్రం ఎక్కడ చూసినా  కాంగ్రెసే కనిపించేలా చేశారు. ఇపుడు మరొక  వినూత్న ఉద్యమం చేపడుతున్నారు పిసిసి అధ్యక్షుడు రఘు వీరా రెడ్డి.  ఈ సారి రూలింగ్ పార్టీ అబద్ధాలమీద ఉద్యమం చేయబోతున్నారు. అది కూడా సైకిల్ తొక్కుతూ...

 

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ని అభివృధి చేశామని  విషయంలో పోటీ పడి చెబుతున్న అబద్ధాలను బద్దలు గొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి  త్వరలో రాష్ట్రంలో సైకిల్ యాత్ర నిర్వహిస్తారు.  

 

ఇచ్చిన హామీల కంటే ఎక్కువ నెరవేర్చామని తెలుగుదేశం పార్టీ, 2014  ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన వాటిలో 90% శాతం నెరవేర్చామని బిజెపి  చెప్పుకోవడం దారుణం అంటూ ఇది ఎంత అబద్దమో చెప్పేందుకు ఆయన సైకిల్ తొక్కబోతున్నారు.

 

బాబు ఎన్నికలో 600 హామీలు ఇచ్చారు  టీడీపీ నెరవేర్చిందో ఎన్నో చెప్పాలని ఆయన అడుగుతున్నారు.

 

ఇదే విధంగా విభజన బిల్లులో ఉన్న హామీలో బీజేపీ ఎన్ని నెరవేర్చిందో చెప్పాలి ప్రజలకు వివరించాలని రఘువీరా డిమాండ్ చేశారు.

 

రెండు  పార్టీ లు అబద్దలు చెప్తూ ...ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

 

ఈ ఉద్యమంలో భాగంగా ఈ నెల  10 న మండల స్థాయి నుండి పై స్థాయి వరకు అందరు నాయకులతో ఒక సదస్సు  నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

 

ఈ  సదస్సు లో నోట్ల సమస్య పై ,ప్రత్యేక హోదా ,విభజన బిల్లులో ఉన్న అంశాలు ,పోలవరం ,టీడీపీ ఎన్నికల హామీలు పై చర్చిస్తామని చెబుతూ ఈ సమస్యల పై త్వరలో సైకిల్ యాత్ర కూడా నిర్వహిస్తామని ఆయన  ప్రకటించారు.

 

కాంగ్రెస్ పార్టీ కి 2017  పోరాటనామ సంవత్సరంగా పిసిసి అధ్యక్షుడుపేర్కొన్నారు.

 

 లోకేశ్ మంత్రి అవుబోతుండటం లోవింతేమీ లేదని చెబుతూ ఇపుడు తెరవెనక కథ నడిపించారు,ఇక ముందు అంతా బాహాటంగానే ఉంటుందని ఆయన అన్నారు.

 

“ఇందులో  కొత్త ఏమి లేదు....ఇప్పటికే లోకేష్ తెర వెనుక తన పాత్ర నిర్వహిస్తున్నాడు ...ఇప్పుడు తెర పై కి తెస్తున్నారు అంతే తేడా ..”అని ఆయన వ్యాఖ్యానించారు.

 

కాబినెట్ లో బాబు కి ఎవరి పై నమ్మకం లేదని, పార్టీ లో ఉన్న వారి నసలూ నమ్మడని అంటూ ఆయనకిపుడు లోకేశ్ అవసరం ఉందని అన్నారు.

 

కొడకును తీసుకోవడంలో ఉన్న క్యాబినెట్ లోగిరిజనులకు,మైనారిటీ  లకు స్థానం కల్పించడం మీద లేదని అటూ దీనికి ముఖ్యమంత్రి  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 

PREV
click me!

Recommended Stories

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu
LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu