షాక్ తిన్నా: రాహుల్ తో చంద్రబాబు భేటీపై రఘువీరా

Published : Dec 01, 2018, 11:38 AM ISTUpdated : Dec 01, 2018, 11:57 AM IST
షాక్ తిన్నా: రాహుల్ తో చంద్రబాబు భేటీపై రఘువీరా

సారాంశం

ఆ షాక్ నుంచి తేరుకోవడానికి తనకు 24గంటల సమయం పట్టిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు.  


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు .. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారన్న విషయం తెలియగానే తాను షాక్ తిన్నానని.. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి తనకు 24గంటల సమయం పట్టిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు.

కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు కాంగ్రెస్ తో చంద్రబాబు చేతులు కలిపిన సంగతి తెలిసిందే. తెలంగాణలోనూ కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఈ విషయంపై తాజాగా రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడారు.

మొదట రాహుల్- చంద్రబాబు భేటీ విషయం విని షాక్ తినప్పటికీ తర్వాత.. రాహుల్ నిర్ణయం తమకు శిరోధార్యమని భావించినట్లు చెప్పారు. ‘‘ అసలు రాహుల్‌ వద్దకు చంద్రబాబు ఎందుకు వెళ్లారంటే.. రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా.. జాతీయ పార్టీ అయినా పొత్తు లేకుండా ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తే 40 లేదా 50 సీట్లు కూడా రావు. అలాంటప్పుడు ఏ పార్టీకి అధికారం రాదు. అందుకే కాంగ్రెస్ తో కలిశారని’’ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు.

ఏపీలో పొత్తు విషయం పూర్తిగా రాహుల్ నిర్ణయానికే వదిలేసామని.. ఒంటరిగా పోటీ చేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu