అవసరం ఉన్నా కూడా.. జగన్ మాకొద్దు.. రఘువీరా రెడ్డి

Published : Feb 08, 2019, 10:12 AM IST
అవసరం ఉన్నా కూడా.. జగన్ మాకొద్దు.. రఘువీరా రెడ్డి

సారాంశం

వైసీపీతో తమకు అవసరం వచ్చినా కూడా.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోమని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలిపారు.

వైసీపీతో తమకు అవసరం వచ్చినా కూడా.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోమని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలిపారు.  కేంద్రంలో  ప్రత్యేక హోదాపై ఎవరు సంతకం చేస్తారో వారికే వైసీపీ మద్దతు ఇస్తుందంటూ.. జగన చేసిన  వ్యాఖ్యలను తాము నమ్మమని ఆయన చెప్పారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా.. జగన్‌ పార్టీ మద్దతు తీసుకోబోమని స్పష్టం చేశారు. 

తాజాగా.. ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి 200లోక్ సభ సీట్లు వస్తాయని,  ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిచ్చేందుకు ఇతర మిత్రులు సిద్ధంగా ఉన్నారని తెలిపా రు. 

‘హోదా ముగిసిన అధ్యాయమని, ఆంధ్రకు ఇవ్వబోమని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా చెబుతున్నా జగన్‌ ఆ పార్టీని పట్టుకుని వేలాడుతుండడం సిగ్గుచేటు. నీ(జగన్‌) సపోర్ట్‌ అవసరమైనా.. నీ మద్దతు తీసుకునే పరిస్థితిలో మా పార్టీ లేదు. జగన్‌ మాట్లాడితే.. మాట తప్పను.. మడమ తిప్పనంటుంటారు. ఈ మాటలంటూ కాంగ్రెస్‌ కండువా ధరించే తన తండ్రికి వైసీపీ కండువా కప్పడం చూసి వైఎస్‌ ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!