హోదా నేను తెస్తా.. సీఎం నేనే అవుతా.. జగన్

Published : Feb 08, 2019, 09:36 AM IST
హోదా నేను తెస్తా.. సీఎం నేనే అవుతా.. జగన్

సారాంశం

ఏపీకి హోదా తీసుకువచ్చే బాధ్యత తనదని వైసీపీ అధినేత జగన్ హామీ ఇచ్చారు. 

ఏపీకి హోదా తీసుకువచ్చే బాధ్యత తనదని వైసీపీ అధినేత జగన్ హామీ ఇచ్చారు. గురువారం కడప మున్సిపల్‌ మైదానంలో బూత్‌ కమిటీ సభ్యులు, కన్వీనర్లతో జరిగిన ‘సమర శంఖారవం’ సభలో జగన్‌ మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని వైసీపీ అధినేత జగన్‌ ధ్వజమెత్తారు. తిరుపతి సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

అనంతరం చంద్రబాబు, పవన్ లపై జగన్ విమర్శల వర్షం కురిపించారు. పవన్ ఇంతకాలం టీడీపీ, బీజేపీలతో కలిసి ఊరూరా తరిగారని గుర్తు చేశారు. నాలుగేళ్లు వాళ్లంతా కలిసి పనిచేశారని చెప్పారు. హోదా తెచ్చే బాధ్యత తనదని పవన్ చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబు చేయకపోయినా.. తాను చేస్తానని చెప్పి  పవన్ మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ లను నమ్మవద్దని హితవు పలికారు.

వైసీపీ 25ఎంపీ సీట్లు గెలుచుకుంటే.. హోదా మనమే సాధించుకోవచ్చని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని చెప్పారు. వైసీపీ ని గెలిపించే బాధ్యత ప్రజల భుజాలపై పెడుతున్నట్లు చెప్పారు. తాను సీఎం కావడం ఖాయమని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!