మోడీ మోసాల గారడి. జగన్ మాటల గారడిని నమ్మొద్దు: చంద్రబాబు

Siva Kodati |  
Published : Feb 08, 2019, 08:26 AM ISTUpdated : Feb 08, 2019, 09:06 AM IST
మోడీ మోసాల గారడి. జగన్ మాటల గారడిని నమ్మొద్దు: చంద్రబాబు

సారాంశం

కాపులకు రిజర్వేషన్లు ఇస్తామన్న మాట నిలబెట్టుకున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా ఆయన ఇవాళ పార్టీ కీలక నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ దారుణంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.  ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన గాయాన్ని మోడీ మరింత పెద్దదిగా చేస్తున్నారని, ఇవాళ సభలో నా ప్రసంగమే మేనిఫెస్టోలో ప్రతిబింబిస్తుందన్నారు. కార్యకర్తల సాధికారతపై ఫోకస్ పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

అందరి భవిష్యత్తును ప్రధాని అంధకారం చేశారన్నారు. 23 పార్టీల కలయికను మహా కల్తీ అనడం మోడీ దిగజారుడుతనమని చంద్రబాబు దుయ్యబట్టారు. మోడీ మాటల గారడి, జగన్ మోసాల గారడిని ప్రజలు గమనించాలని ఆయన పిలుపునిచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!