
విజయవాడ (vijayawada)లోని హోటళ్లు, రెస్టారెంట్లపై నగరపాలక సంస్థ ఫుడ్ సేఫ్టీ (food safety) అధికారులు దాడులు (Raids) చేశారు. నగరంలోని సింగ్‌నగర్‌లో వున్న శ్రీ ఆంజనేయ రెస్టారెంట్‌లో (sri anjaneya restaurant) నిల్వ వుంచిన మాంసం, చేపలు గుర్తించారు. మటన్‌లో బీఫ్ మాంసం కలిపినట్లు గుర్తించారు అధికారులు. నిల్వ ఆహారం అందడంపై వినియోగదారుల ఫిర్యాదులపై స్పందించినట్లు అధికారులు తెలిపారు. ఆంజనేయా రెస్టారెంట్‌ను సీజ్ చేసిన అధికారులు.. సింగ్‌నగర్‌లోని మరో రెండు రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.