ఆ 2వేల రూపాయల నోట్లు మా పార్టీ పెద్దలవేనేమో?.. రఘురామకృష్ణంరాజు

By SumaBala BukkaFirst Published Jun 14, 2023, 6:58 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ లో చీప్ లిక్కర్ కొనుగోలు కోసం నలగని రూ.2వేల నోట్లు వాడడం పేదల వల్ల కాదని.. ఆ నోట్లు తమ పార్టీకి చెందిన నేతలవేనన్నారు రఘురామ. 

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లో ఒకే సిరీస్ లోని రూ. 2000 నోట్లు, ఏమాత్రం నలగని ఈ నోట్లతో చీప్ లిక్కర్ కొనుగోలు చేస్తున్నారనే వార్తలతో పేదవారిని తప్పు పట్టడం సరికాదని.. వారు 2000 నోట్లు మార్పిడి చేస్తున్నారని హాస్యాస్పదమని వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. అవి తమ పార్టీ పెద్దలకు చెందినవై ఉండొచ్చన్నారు. పేరుకుపోయిన పెద్ద నోట్లను ఈ రూపంలో మార్చుకునేందుకు ముందు చూపుతోనే తమ పార్టీ పెద్దలు మద్యం విక్రయాలను నగదుతో సాగిస్తున్నట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు. మంగళవారం ఢిల్లీలో రఘురామకృష్ణంరాజు విలేకరులతో మాట్లాడారు.

రూ.100, రూ.200నోట్లను ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగానే కొనసాగిస్తూ డిజిటల్ కరెన్సీ ప్రవేశపెట్టాలని.. అలా అయితేనే ఎన్నికలు సజావుగా సాగుతాయని అన్నారు. తెలంగాణతో పాటే రాష్ట్రంలోనూ ముందస్తు ఎన్నికలు జరగడం ఖాయమని ప్రజలు ప్రతిపక్షాలు దీనికి సిద్ధంగా ఉండాలని రఘురామ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. అంతేకాదు ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో సరి చూసుకోవాలని కోరారు. 

దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయని.. అవి నమోదు కాకుండా పర్యవేక్షిస్తూ అడ్డుకోవాలని సూచించారు. రాష్ట్రంలో జీరో అభివృద్ధితో కూడిన సంక్షేమం అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమాలు ఒకసారిగా నిలిచిపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జోస్యం చెప్పారు.

ఏపీ అసెంబ్లీ ఆగస్ట్ లో రద్దు.. తెలంగాణతోపాటే ఎన్నికలు.. రఘురామ జోస్యం...

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో చెప్పడానికి ఒకే ఒక ఉదాహరణ మంత్రి వేణుగోపాలకృష్ణ వ్యక్తిగత సిబ్బందికి గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం అని..  దీంతో వారు ఆయన చాంబర్ తాళం వేశారని చెప్పుకొచ్చారు రఘురామకృష్ణరాజు.

ఇదిలా ఉండగా, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద జోస్యం చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీలోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆగస్టులో ఏపీ అసెంబ్లీని రద్దుచేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ ఊహాగానాలు చేశారు. ఇటీవల శ్రీకాళహస్తి సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను ఊటంకిస్తూ.. ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వానికి అప్పు పుట్టే పరిస్థితులు లేవని అన్నారు. దీనివల్లే ముఖ్యమంత్రి జగన్.. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళతారని చెప్పుకొచ్చారు.

ఢిల్లీలోని తన నివాసంలో ఆదివారం రఘురామకృష్ణంరాజు విలేఖరులతో మాట్లాడారు. జేపీ నడ్డా వ్యాఖ్యల ప్రకారం ప్రభుత్వానికి అప్పు పుట్టే పరిస్థితి లేదని.. అప్పు పుట్టకపోతే జగన్ ప్రభుత్వాన్ని ఒక రోజు కూడా నడపలేరని అన్నారు. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఏపీ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయన్నారు. 

ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనతోనే భారీగా దొంగ ఓట్లు నమోదు చేయిస్తుంది. దీనికి విశాఖపట్నం, గుంటూరులలో బయటపడ్డ ఉదంతాలే ఉదాహరణ. వైసిపి సానుభూతిపరుల ఇళ్లల్లో కొత్త ఓట్లను నమోదు చేయిస్తున్నారు. మరోవైపు టిడిపి, జనసేన సానుభూతిపరుల ఓట్లు తీసేస్తున్నారు.

దీని దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఓటర్ల జాబితాను పరిశీలించాలి. ఓటర్లు కూడా తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి’  అని సూచనలు చేశారు. మరోవైపు ముందస్తు ఎన్నికలు రావని తమ పార్టీ నాయకత్వం ప్రతిపక్షాలను మభ్యపెడుతోందని.. అలా చెబుతూ మరోవైపు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేస్తుందని అన్నారు.  అలా చేసి అసెంబ్లీని రద్దు చేయాలన్నది ఎత్తుగడ అని అన్నారు.

click me!