ఓపీఎస్‌కు దగ్గరగానే జీపీఎస్, సమస్యలు పరిష్కరించినందుకు జగన్‌కు ధన్యవాదాలు : బొప్పరాజు

By Siva KodatiFirst Published Jun 13, 2023, 6:58 PM IST
Highlights

తమ సమస్యలు పరిష్కరించినందుకు గాను ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఓల్డ్ పెన్షన్ సిస్టమ్‌కు సమాంతరంగా జీపీఎస్ వున్నందున సంతోషంగా వుందని.. అలాగే ఉద్యోగులకు సంబంధించి వాడుకున్న సొమ్మును తిరిగి జమ చేస్తామని ప్రభుత్వం చెప్పిందని ఆయన పేర్కొన్నారు. 
 

సమస్యల పరిష్కారం కోసం గత కొద్దినెలలుగా ఏపీ ప్రభుత్వోద్యోగులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీఎం జగన్ ఒక్కొక్కటిగా డిమాండ్లను పరిష్కరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించినందుకు గాను ముఖ్యమంత్రి జగన్‌కి ధన్యవాదాలు తెలిపారు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను బొప్పరాజు తదితర ఉద్యోగ నేతలు కలిశారు. అనంతరం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. 47 అంశాలపై తాము సీఎస్‌కు లేఖ రాస్తే, 36 అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని బొప్పరాజు తెలిపారు. 

ప్రభుత్వానికి, ఉద్యోగులను దూరం చేసేందుకు కొన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో చర్చలు నడుపుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం నుంచి రూ.734 కోట్ల డీఏ బకాయిలు రావాల్సి వుందని.. అలాగే సరెండర్ లీవులు, డీఏలు కలిపి రూ.1800 కోట్లు బకాయిలను సెప్టెంబర్‌లోపు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని బొప్పరాజు తెలిపారు. 2014 జూన్ 2 ముందు నుంచి విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని సీఎం చెప్పారని.. అలాగే 12వ పీఆర్సీ ద్వారా చర్చలు జరుపుతామని జగన్ తెలిపారని వెంకటేశ్వర్లు తెలిపారు. 

Latest Videos

ALso Read: కొత్త పెన్షన్ విధానం, ప్రభుత్వ శాఖగా వైద్య విధాన పరిషత్ : ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

పదవీ విరమణ తర్వాత ఇస్తామన్న డీఏలు, పీఆర్సీ ఎరియర్లను.. ఏటా నాలుగు వాయిదాల్లో చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పిందని బొప్పరాజు తెలిపారు. ఓల్డ్ పెన్షన్ సిస్టమ్‌కు సమాంతరంగా జీపీఎస్ వున్నందున సంతోషంగా వుందని.. అలాగే ఉద్యోగులకు సంబంధించి వాడుకున్న సొమ్మును తిరిగి జమ చేస్తామని ప్రభుత్వం చెప్పిందని ఆయన పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించే బాధ్యతను తామే తీసుకుంటామని బొప్పరాజు వెల్లడించారు. 

click me!