జగన్ కి రఘురామ మరో షాక్: ఈసారి దేనిమీదంటే...

By Sreeharsha GopaganiFirst Published Jul 5, 2020, 6:16 PM IST
Highlights

జగన్ ని మరింత ఇరకాటంలోకి నెడుతూ మరోలేఖాస్త్రాన్ని సంధించారు రఘురామ. వృద్ధాప్య పింఛన్ల గురించి ఆయన ఈసారి జగన్ ని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేసారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధ్యాప్య ఫించన్ వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60కి తగ్గిస్తూ జీవో ఇచ్చారని, దాని ద్వారా అవ్వాతాతలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రఘురామకృష్ణంరాజు ఇప్పుడొక హాట్ టాపిక్. ఆయన వైసీపీలోనే ఉంటూ వైసీపీ పార్టీకి అనేక ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నారు. టీవీ చానెల్స్ లో డిబేట్స్ దగ్గరి నుండి లేఖాస్త్రాల వరకు తాను జగన్ మోహన్ రెడ్డి మాటను జవదాటను అని అంటూనే వైసీపీ వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 

తాజాగా జగన్ ని మరింత ఇరకాటంలోకి నెడుతూ మరోలేఖాస్త్రాన్ని సంధించారు రఘురామ. వృద్ధాప్య పింఛన్ల గురించి ఆయన ఈసారి జగన్ ని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేసారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధ్యాప్య ఫించన్ వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60కి తగ్గిస్తూ జీవో ఇచ్చారని, దాని ద్వారా అవ్వాతాతలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. 

దీనివల్ల లబ్దిదారులు 7 నెలల కాలానికి రూ.15,750 నష్టపోయారని లబ్దిదారులకు ఆ మొత్తం అందేలా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు. ప్రతీ ఏడాది రూ.250 పెంచుతున్న పెన్షన్ కానుకను.. వైఎస్‌ జయంతి రోజు నుంచి అమలయ్యేలా చూడాలని రఘురామకృష్ణం రాజు తన లేఖలో పేర్కొన్నారు. 

ఇక నిన్న అమరావతి రైతుల ఉద్యమం 200వ  సందర్భంగా వారితరుఫున వారికి  రఘురామ. అమరావతి ప్రాంత ప్రజలకు, అమరావతి ఉద్యమానికి తన మద్దతును ప్రకటించారు. ఆనాడు జగన్ మోహన్ రెడ్డి సైతం అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నారని అన్నాడు. జగన్ మూడు రాజధానుల నిర్ణయం విషయాన్నీ పూర్తిగా వ్యతిరేకించకుండానే చాలా జాగ్రత్తగా జగన్ ని ఇరుకున పెట్టె ప్రయత్నం చేసారు. 

ఆయన ఎప్పటినుండో అంటున్నట్టే కార్యనిర్వాహక రాజధానిని అమరావతిలో ఉంచొచ్చు కదా అని వాదించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు విశాఖకు తరలించి అక్కడ రాజధాని నిర్మాణానికి ఖర్చు పెట్టడం కన్నా, ఇప్పుడు ఇక్కడ అందుబాటులో ఉన్న అమరావతిని వాడుకోవాలని సూచించారు. 

తన పార్టీకి తాను ఇచ్చే సలహా ఇదేనని అంటున్నాడు. శాసన రాజధానిని విశాఖకు తరలించి, కార్యనిర్వాహక రాజధానిని అమరావతిలో ఉంచేలా చూడాలని ఆయన అన్నారు. దొరికిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడానికి రఘురామ సిద్ధంగా లేరు. 

click me!