ప్రజా ప్రతినిధుల్లో పెరుగుతున్న కరోనా బాధితులు.. టీడీపీ నేత బోడె ప్రసాద్‌కు పాజిటివ్

By Siva Kodati  |  First Published Jul 5, 2020, 5:22 PM IST

కృష్ణా జిల్లా పెనమలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బోడె ప్రసాద్‌కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఆయన కోవిడ్ టెస్టులు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. 


తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సామాన్యులతో పాటు నిత్యం ప్రజల మధ్యలో ఉండే ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు సైతం వైరస్ బారినపడుతున్నారు.

తాజాగా కృష్ణా జిల్లా పెనమలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బోడె ప్రసాద్‌కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఆయన కోవిడ్ టెస్టులు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది.

Latest Videos

undefined

దీంతో ఆయన హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతుననారు. బోడు ప్రసాద్ దాదాపు 15 రోజుల నుంచి గ్రామాల్లో పర్యటిస్తుండటం, ఆయన కార్యాలయానికి కూడా ఎక్కువ మంది ప్రజలు వస్తుండటంతో వైరస్‌ సోకినట్లుగా భావిస్తున్నారు.

Also Read:ఒక్క రోజులోనే 14 మంది మృతి: ఏపీలో 18,697కి చేరిన కరోనా కేసులు

మరోవైపు ఆయన భార్య హేమా చౌదరికి ఫలితాల్లో నెగిటివ్ వచ్చింది. దీంతో ఆమెను హోం క్వారంటైన్‌లో ఉంచారు. పోలీస్, రెవెన్యూ, ఆరోగ్య, పంచాయతీ అధికారులు... బోడె ప్రసాద్ ఇంటి పరిసరాల్లో శానిటేషన్ పనులు చేయిస్తున్నారు.

కాగా ఏపీలో ఆదివారం నాటికి కరోనా కేసులు సంఖ్య 18,697కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 14 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 232కి చేరింది. గత 24 గంటల్లో 391 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కోలుకున్న వారి సంఖ్య 8,422కు చేరుకోగా, మరో 10,043 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

click me!