మెడల్ తేవడం గర్వంగా ఉంది.. పీవీ సింధు..!

Published : Aug 06, 2021, 08:41 AM IST
మెడల్ తేవడం గర్వంగా ఉంది.. పీవీ సింధు..!

సారాంశం

ఒలంపిక్స్ వెళ్లేముందు సీఎం జగన్ తనకు సపోర్ట్ చేశారని, అండగా ఉంటానని హామీ ఇచ్చారని పీవీ సింధు తెలిపారు. ఒలంపిక్స్‌లో పతకం తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు.

తెలుగు తేజం పీవీ సింధు టోక్యో ఒలంపిక్స్ లో అదరగొట్టింది. ఆమె కాంస్య పతకంతో హైదరాబాద్ తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా ఆమెకు ఘన స్వాగతం లభించింది. విజయవాడలోనూ ఆమెకు ఘన స్వాగతం పలికారు. విజయవాడలో మంత్రి అవంతి శ్రీనివాస్.. పీవీ సింధుని కలిశారు.

ఈ సందర్భంగా సింధు.. మీడియాతో మాట్లాడారు. విజయవాడ‌లో తనకు గ్రాండ్‌గా వెల్‌కమ్ లభించిందన్నారు. ఒలంపిక్స్ వెళ్లేముందు సీఎం జగన్ తనకు సపోర్ట్ చేశారని, అండగా ఉంటానని హామీ ఇచ్చారని పీవీ సింధు తెలిపారు. ఒలంపిక్స్‌లో పతకం తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. 

ఒలంపిక్స్‌లో మెడల్ తీసుకురావడం ద్వారా గర్వంగా ఉందని చెప్పారు.  కాంస్య పతకం పోరులో గెలిచిన తర్వాత రెండు నిమిషాలు బ్లాంక్ అయ్యానని పీవీ సింధు పేర్కొన్నారు. సెకండ్ టైమ్ ఒలంపిక్ మెడల్ దేశానికి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. తాను ఇక్కడే జాబ్ చేస్తున్నానని, అభిమానం చూపిన వారందరికి ఒలింపిక్ పతకాన్ని అంకితమిస్తున్నట్లు పీవీ సింధు పేర్కొన్నారు.  

PREV
click me!

Recommended Stories

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ చిన్న‌ గ్రామం త్వరలోనే మరో సైబరాబాద్ కానుంది, అదృష్టం అంటే వీళ్లదే
IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!