ప్రియుడ్ని కట్టేసి యువతిపై గ్యాంగ్ రేప్: పోలీసుల అదుపులో నిందితుడు?

By telugu team  |  First Published Aug 6, 2021, 7:22 AM IST

ఏపీలో సంచలన రేపిన గుంటూరు జిల్లా సీతానగరం గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రియుడిని కట్టేసి ప్రేయసిపై ఇద్దరు నిందితులు అత్యాచారం చేశారు.


అమరావతి: గుంటూరు జిల్లా సీతానగరం అత్యాచారం కేసులో పోలీసులు ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సీతానగరంలో నిందితులు ప్రియుడిని కట్టేసి యువతిపై అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. నిందితులు చాలా కాలంగా పరారీలో ఉన్నారు. ఎట్టకేలకు ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 

సీతానగరం అత్యాచారం కేసులోని ఇద్దరు నిందితుల్లో ఒకతన్ని చివరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులకు చిక్కిన నిందితుడు షేర్ కృష్ణనా, వెంకటా రెడ్డి అనేది స్పష్టం కావడం లేదు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీసులు 30 రోజుల పాటు వివిధ వేషధారణలతో మాటు వేసి ఒకడ్ని పట్టుకున్నట్లు తెలుస్తోంది. 

Latest Videos

Also Read: ప్రియుడ్ని కట్టేసి గ్యాంగ్ రేప్: ఆస్పత్రి నుంచి బాధితురాలి డిశ్చార్జ్

పోలీసులు యాచకులను, హిజ్రాలను, సమోసాల అమ్మకందార్లను, రైల్వే ట్రాక్ వద్ద చెత్త ఏరుకునే వారిని విచారిస్తూ చివరకు ఒంగోలు ఫ్లై ఓవర్ కింద విశ్రాంతి తీసుకుంటున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. రెండో నిందితుడు కూడా ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో పోలీసులు ఒంగోలు రైల్వే ట్రాక్ ల్లో, ఇతర ప్రాంతాల్లోనూ గాలింపు చేపట్టారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. 

ఇద్దరు నిందితులు కూడా క్యాటరింగ్ చేస్తున్నట్లు పోలీసులు పక్కా సమాచారం అందింది. దీంతో వాళ్లు ఒంగోలు, చీరాల, బాపట్ల, అద్దంకి ప్రాంతాల్లో, చెన్నై ర్లైవ్ మార్గంలోని ప్రధాన పట్టణాల్లో, గ్రామాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు జరుపుతున్నారు.

click me!