ఏపీపై దృష్టిపెట్టిన కాంగ్రెస్ హైకమాండ్: 11న ఢిల్లీకి రండి.. నేతలకు రాహుల్ నుంచి పిలుపు

Siva Kodati |  
Published : Aug 05, 2021, 10:30 PM IST
ఏపీపై దృష్టిపెట్టిన కాంగ్రెస్ హైకమాండ్: 11న ఢిల్లీకి రండి.. నేతలకు రాహుల్ నుంచి పిలుపు

సారాంశం

రాష్ట్ర విభజన తర్వాత పాతాళంలో భూస్థాపితమైన ఏపీ కాంగ్రెస్‌కు తిరిగి జవసత్వాలు తీసుకురావాలని హైకమాండ్ భావిస్తోంది. దీనిలో భాగంగా 11న ఢిల్లీకి రావాల్సిందిగా ఏపీ కాంగ్రెస్ నేతలను రాహుల్ గాంధీ ఆదేశించారు.

ఈ నెల 11న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు ఏపీ పీసీసీ నేతలు. పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చించనున్నారు. విడివిడిగా ఏపీ సీనియర్ నేతలతో చర్చించనున్నారు రాహుల్. ఇప్పటికే అధిష్టానం నుంచి నేతలకు పిలుపొచ్చింది. ఏపీలో పార్టీ పరిస్ధితిపై నేతలు చర్చించనున్నారు. ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర నేతల అభిప్రాయాలను, ఆలోచనలను తెలుసుకోనున్నారు. ఈ సమావేశం తర్వాత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అధిష్టానం పిలుపు నేపథ్యంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, చింతా మోహన్, పల్లంరాజు, కేవీపీ రామచంద్రరావులు ఢిల్లీకి వెళ్లనున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu