పుట్టపర్తి ఛైర్మన్ పై వేటు

Published : Jun 24, 2017, 02:22 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
పుట్టపర్తి ఛైర్మన్ పై వేటు

సారాంశం

గంగన్నఫిట్టింగ్ ను టిడిపి నేతలు భరించలేకపోయారు. మిగిలిన వాళ్ళతో రాజీనామాలు చేయించాల్సిన వాళ్ళు ఆపని చేయకుండా కేవలం గంగన్న రాజీనామా విషయంలో మాత్రం పట్టపట్టారు. దాంతో సమస్య ముదిరిపోయింది.  గంగన్న చేత రాజీనామా చేయించలేక చివరకు పార్టీ నుండే వేటు వేసారు.

పుట్టపర్తి మున్సిపల్ ఛైర్మన్ గంగన్నను పార్టీ నుండి ఆరేళ్ళ పాటు పార్టీ నుండి బహిష్కరించారు. చంద్రబాబు ఆదేశాలను ధిక్కరించినందుకు గంగన్నపై వేటు పడింది. పుట్టపర్తి మున్సిపల్ ఛైర్మన్ గా రెండున్నరేళ్ళ తర్వాత గంగన్న రాజీనామా చేయాలి. అయితే, అందుకు ఛైర్మన్ అడ్డం తిరిగారు. ఎందుకంటే, గంగన్నతో పాటు రాజీనామా చేయాల్సిన మున్సిపల్ వైస్ ఛైర్మన్, పుట్టపర్తి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (పుడా)ఛైర్మన్, పుట్టపర్తి ఎంపిపి, సింగిల్ విండో అధ్యక్షుడు వాళ్ళు కూడా రాజీనామాలు చేస్తే తాను కూడా రాజీనామా చేస్తానంటూ గంగన్న ఫిట్టింగ్ పెట్టారు.

అయితే, గంగన్నఫిట్టింగ్ ను టిడిపి నేతలు భరించలేకపోయారు. మిగిలిన వాళ్ళతో రాజీనామాలు చేయించాల్సిన వాళ్ళు ఆపని చేయకుండా కేవలం గంగన్న రాజీనామా విషయంలో మాత్రం పట్టపట్టారు. దాంతో సమస్య ముదిరిపోయింది.  గంగన్న చేత రాజీనామా చేయించలేక చివరకు పార్టీ నుండే వేటు వేసారు.

PREV
click me!

Recommended Stories

Success Story : అన్న క్యాంటీన్ నుండి పోలీస్ జాబ్ వరకు .. ఈమెది కదా సక్సెస్ అంటే..!
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ చిన్న‌ గ్రామం త్వరలోనే మరో సైబరాబాద్ కానుంది, అదృష్టం అంటే వీళ్లదే