విలువల గురించి పురంధేశ్వరే చెప్పాలి

Published : Mar 03, 2017, 04:26 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
విలువల గురించి పురంధేశ్వరే చెప్పాలి

సారాంశం

కేవలం పదవుల కోసమే పార్టీ మారే వారు కూడా ‘విలువల’ గురించి మాట్లాడితే ఎలాగమ్మా పురంధేశ్వరీ?

రాజకీయాల్లో విలువలగురించి పురంధేశ్వరి దగ్గరే నేర్చుకోవాలి. ఎందుకంటే, రాజకీయాల్లో విలువలను పాటిస్తున్నవ్యక్తిగా తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటున్నారు మరి. పురంధేశ్వరి గురించి ఇపుడెందుకంటే, ఆవిడ వైసీపీలో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు కాబట్టి. పురంధేశ్వరి వైసీపీలో చేరుతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాను వైసీపీలో చేరటం లేదని చెప్పారు. ప్రచారం మొదలైనపుడే స్పందించకుండా ఇంతకాలం ఎందుకు కామ్ గా ఉన్నారో ఆమే చెప్పాలి.

 

ఇక విలువల గురించి మాట్లాడుతూ, తండ్రి ఎన్టిఆర్, భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాజకీయాల్లో తనకు విలువలు నేర్పారట. వారిద్దరూ నేర్పిన విలువలేమిటి? ఈమె నేర్చుకున్న విలువలేమిటో మాత్రం చెప్పలేదు. ఎందుకంటే, ఎన్టీఆర్ బతికున్నంత కాలం పురంధేశ్వరి రాజకీయాల్లో లేరు. కాబట్టి తండ్రి నేర్పినదేమిటి? మరి అంత విలువలను నేర్పిన తండ్రినే పదవిలో నుండి  దింపేసిన వారితో ఎందుకు చేతులు కలిపింది. సిఎంగా ఉన్న ఎన్టీఆర్ ను వెన్నుపోటు ద్వారా దింపేసిన వాళ్ళల్లో మరిది చంద్రబాబునాయుడు, భర్త దగ్గబాటే కదా ముఖ్యులు? తండ్రికి వ్యతిరేకంగా కుట్రచేసిన వారితో జట్టుకట్టిన తర్వాత పురంధేశ్వరికి ఇంకేమి విలువలున్నట్లు?

 

తర్వాత వైఎస్ఆర్ కారణంగా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. కేంద్రమంత్రిగా పదేళ్లపాటు బాగనే వెలిగారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు సమాధే అని నిర్ధారించుకుని వెంటనే భాజపాలో చేరటం ఏ విలువలకు నిదర్శనం. అంటే, నమ్మి ఆధరించిన కాంగ్రెస్ కన్నా పదవే ముఖ్యమనుకునే కదా భాజపాలో చేరింది. కేవలం పదవుల కోసమే పార్టీ మారే వారు కూడా ‘విలువల’ గురించి మాట్లాడితే ఎలాగమ్మా పురంధేశ్వరీ?

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?