కమిటీ వేస్తున్నారు, ఇక కథ కంచికేే...

First Published Mar 3, 2017, 3:19 AM IST
Highlights

ముళ్లపాడు ప్రమాదం వేడి, ప్రతిపక్షం వాడి తగ్గించేందుకు అసెంబ్లీ కంటే ముందే ఒక కమిటీని వేసేందుకు రంగం సిద్ధం

కృష్ణాజిల్లా ముళ్లపాడు వద్ద  జరిగిన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్స ఘోర ప్రమాదం మీద వెల్లువెత్తిన నిరసన, ప్రజల్లోదివాకర్ ట్రావెల్స్ పట్ల ఉన్న వ్యతిరేకత కారణంగా అందరి నోళ్లు మూయించేందుకు ప్రభుత్వం పథకం వేసింది.

 

ప్రమాదం చిక్కుకున్న దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డిల దివాకర్ ట్రావెల్స్ ని బయటేసేందుకు ఒక కమిటీని నియమించబోతున్నది. ఈ కమిటీలో రవాణా, అర్ అండ్ బి శాఖలతో కలిపి అయిదారుగురు సీనియర్ అధికారులు ఉండబోతున్నారు.

 

అరో తేదీ నుంచి ప్రారంభమవుతున్న అమరావతి తొలిఅసెంబ్లీ వాయిదా పడేందుకు ఈ ప్రమాదం కారణం కాబోతున్నదని తెలుగుదేశం ప్రభుత్వం పసిగట్టింది. అందువల్ల ప్రమాదం వేడి, ప్రతిపక్షం వాడి తగ్గించేందుకు ముందే ఒక కమిటీని వేసేందుకు రంగం సిద్ధమయిందని విశ్వసనీయ సమాచారం.

 

దీనికితోడు దివాకర్ ట్రావెల్స్ యజమానులు ముఖ్యమంత్రికి బా గా అయిన వారు. ముఖ్యమంత్రి ప్రతిసమావేశం  ఈ మధ్య దివాకర్ రెడ్డి   ‘ప్రార్థన’తోనే మొదలవుతూ ఉంది. కార్యక్రమానికి సంబంధం ఉన్నా  లేక పోయిన మైకందుకు ని,  ప్రతిపక్ష నాయకుడి తిట్ల దండకం ఆయన పూర్తి చేశాకనే చంద్రబాబు నాయుడు తన రాష్ట్రాభివృద్ధి అవు కథ చెబుతుంటారు. కాబట్టి ప్రమాదంలో  చిక్కుకున్న ఎంపిని, ఆయన సోదరుడు ఎమ్మెల్యేని కాపాడటం కూడా అవసరం.

 

  కమిటీ వేసేస్తే,  ప్రస్తుతానికి పబ్బం గడుస్తుంది.

 

  నేరమంతా చనిపోయిన డ్రయివర్ మీద నెట్టేయాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని చాలా మంది అనుమానిస్తున్నారు.

 

డ్రయివర్ తాగి ఉండవచ్చని ప్రతిపక్షనాయకుడు జగన్ అనుమానిస్తున్నందున, దానిని మొదట ఖండించేలా దర్యాప్తు సాగుతుందని తెలిసింది.

 

డ్రయివర్ తూలడం వల్ల ప్రమాదం జరిగిందా అలా అయితే నిద్రమత్తులో తూలాడా లేక మద్యం మత్తులోనా అనే విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తారట.

 

బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఎంత వేగంగా వెళుతోంది? బస్సు వేగానికి సంబంధించి బస్సులో   ఆన్‌బోర్డు డివైసే అమర్చారా, అమర్చి ఉంటే  అదే మయింది? ప్రమాదం జరిగిందన్న ఉద్వేగంలో రవాణా అధికారులు అందించిన ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని, అది బస్సు యాజమాన్యాన్ని తప్పు పట్టేలా ఉందని కూడా తెలిసింది. అందువల్ల ఒక ‘ లోతైన’ నివేదిక వస్తే ‘ వాస్తవం’ వెలికివస్తుందని ఈ  కమిటీని నియమిస్తున్నారని వినికిడి.

 

బస్సు ప్రమాదంలో 11 మందిచనిపోవడం . 37 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఇందులో చాలా మంది కోలుకోవడానికి  ఒక ఏడాదికంటే ఎక్కువ కాలం పట్టవ చ్చని చెబుతున్నారు. 

 

దర్యాప్తు పూర్తయ్యే లోపు  ప్రమాదం గురించి ఏ విషయాలు వెల్లడించవద్దని కూడా అధికారులకు సూచనలందాయని తెలిసింది.

click me!